1. అంతఃపురోపన్యాసము
ఒక కవి తమ నంఘానికి ఈ ఉపన్యానం పంపించాడంటూ సాక్షి చదివి వినిపించాడు. భార్య సాధింవుగా మాట్లాడే మాటల్ని “కర్టెన్ లెక్ఛర్” అని ఇంగ్లీషులో అంటారు. నంన్క లంలో ’భాణం’ అనే రూవక భేదానికిది స్వరూపం లో దగ్గరగా వుంది.
ఈ అంతఃపురోపన్యానంలో ఒక ఇంటావిడ తన భర్తను ప్లీడర్ వృత్తి విడిచిపెట్టి ప్రజాసేవ చేయమని ప్రోత్సహించడం సారాంశం.
నిజానికీ ప్లీడరుగారు నంన్కర్తే. బ్రవ్మాసామాజికుడు. పెళ్లికూడా బ్రావ్మావివాహ పద్దతిలో చేనుకున్నాడు.
ఇంటావిడ అనేదేమిటంటే -“సంపాదించిన నంపాదన చాలు. ప్లీడర్ వృత్తి ద్వారా న్యాయాన్ని కాపొడుతున్నారా! -చంవుతున్నారా? పార్టీలకు అబద్దపు సాక్ష్యాలు చిలకవలుకుల్లా చెప్పడం తప్ప, వేరే ఏముంది? వాళ్ల జుట్టు వీళ్లకి,వీళ్ల జుట్టు వాళ్లకీ ముడిపెట్టడం చాలించి దేశ క్షేమానికేమైనా వనిచేయమంది.హరిజనుల్ని మంచి మార్గంలో పెట్టవచ్చు. రాత్రి పాఠశాలలు నడపవచ్చు. రాట్నం మీద నూలు వడికి స్వదేశీ దుస్తులు తయారు చేయ వచ్చు. ఆరోగ్య సూత్రాలు జనసామాన్యానికి కర పత్రాల ద్వారా తెలియజేయ వచ్చు. గ్రామాలలో వంచాయితీ కోర్టులు నెలకొల్పవచ్చు. మనకు పిల్లలు లేరని లోటు వడనక్కరలేదు. నేనూ సహకరిస్తాను" అంది. దేశోవకారం కంటె చేయదగినదేమీ లేదని ఘంటా పథంగా చెప్పింది.
నిజానికి మగవారి ప్రతి విజయానికి అండగా స్త్రీ ఉండక తీరదని ఉదాహరణలు కూడా ఇచ్చింది. ఆచరణతో కూడిన నంస్కారమే దేశాభివృ ద్ధికి కావాలి కదా!-అంది.
మాసంఘమునకు మఱియొక కవి తాను రచించిన యంతఃపురోపన్యాసము నంపినాడు. అది చదివెదను.
ఇదిగో! మాటలాడరేమి? ఏ మాలోచించినారు? నేంటికిం బదునైదుదినములనుండి మరిమరి యదేపనిగాం జెప్పుచున్నాను. బెల్లము కొట్టినరాయివలె నిశ్శబ్దముగ నున్నారేమి?