సారంగధర నాటకప్రదర్శనము
21
లాడుచుండ నెదుటితెర స̃ఱపఱలాడుచుఁ బైకిఁ బోవుచు నడుమఁ గారణాంతరముచేఁ గొంత యాఁగెను. లోనుండి కొందరు నటకు లెగుడుదిగుడులను సవరించి జబ్బపుష్టి నెటులో దానిఁ బైకిఁ ద్రోసిరి. అంత నొకనటకుఁడు ప్రవేశించి సభకు నమస్కరంచి “అమ్మలారా! అయ్యలారా! నేను దమతో సెల వీయఁబో-ఉcహు! మనవి చేసికొనఁబోవున దే దనఁగా యీదినము కాదు, ఈరాత్రి సరిగా పందొమ్మిది ఆC-తొమ్మిదిగంటలకు నాటకము మొదలుపెట్టుదు మని డప్పుముఖమున వెల్లడించితిమి. కాని యాంతరకారణములచే ఆ? ఆఁ! కారణాంతరములచే నట్లు జరుపలేకపోయితిమి. కాన మీరు క్షంతవ్యులుకాదు. మేమేకాఁబోలు" నని పలికి పోయెను. “ఇప్పుడయినఁ ద్వరగ నారంభింపనియెడల మీరు హంతవ్యు” లని యెవ్వఁడో సభనుండి కేకవైవఁగ “చుప్రహో' యని తెరచాటునుండి మఱుకేక వచ్చెను. వేఁపాకువేస మీదినము రాదు కాఁబోలు నని నాయఁడు బెంగ పెట్టుకొనెను. అంతట గ్రామసంచారమునఁ గృతార్థులయి నల్వురు రక్షకభటులు “టిక్కట్లు" లేకుండ లోనికి వచ్చిరి. వారినెత్తిపాగల యెఱుపునుబట్టియుఁ, జేతిదుడ్ల నలుపును బట్టియుఁ, బడపమటిచెప్పుల కిఱ్ఱునుబట్టియుఁ వారి కీ యనన్యసానూన్య గౌరవము గలిగిన దని నింటిని. అనాఁటిరాత్రి సారంగధరనాటక ప్రదర్శనము". ఆలస్యకారణమున నాందీప్రస్తావ నలు విడువఁబడుటచేఁ దన్నాటకకవి యెవ్యఁడో తెలియలేదు. గ్రామమునఁ బంచిపెట్టుబ డిన కరపత్రములలోఁగూడఁ గవిప్రశంస లేదు.
మొదటి యంకమున రాజరాజసరేంద్రుఁడు, నతనిప్రధానుఁడు నుద్యానవనమునఁ బ్రవేశించి వేదవిహితకర్మములఁ గూర్చియు వర్ణాశ్రమధర్మ పరిపాలనముఁ గూర్చియు జనులక్షేమముసు, గర్షకుల పంటలఁగూర్చియు, ధాన్యములధరఁగూర్చియు ముచ్చటించు కొనిరి. రాజకార్యవిముఖుఁడై విలాసముగ నుద్యానవమస నున్న రాజు కీసంభాషణ మెందు లకో నా కిప్పటికిని బోధపడలేదు. అంతటఁ జిత్రాంగియు నొకదాసియు నచ్చటకు వచ్చిరి. వారచ్చట కెందులకు వచ్చిరో వారికిఁదెలియదు. వారిని బుట్టించిన బ్రహ్మకును దెలియదు. అంతట రాజు తొందరతో లేచి ప్రధానుని జేయి పట్టుకొని-
కీర్తన "చూచితే? దానిసాగను చూచితే? నాచునంటి కేశచయము.
త్రాచులాగు నెనుకవ్రేలు-చూచితే?"
అని కాలితోఁ దాళమును దాటించుచుఁ బాడెను.
ఈకీర్తననే ఫిడేలుపైఁ దెరలో నొకఁడు వాయించుచుఁ బాడుచుండెను. నేను దెల్లఁబోయి కూరుచుంటిని. కాంతలయందలి యత్యంతానురాగ మొకప్పుడు మనుజులను దాత్కాలికముగఁ గవులను జేయఁగల దనియు, నట్టివారు తాము వలచినవారి సౌందర్యమును గానమొనర్తు రనియు నేను వినియుంటిని. అట్టిమాఱు పే దైన నీరాజులలోఁ గలిగినదేమో: యని సర్దుకొని యూరకుంటిని. ప్రధానుఁ డాకీర్తననే దొరకబుచ్చుకొని-
"చూచితిన్ దానిసొగసు - చూచి
మిన్నువంటి నడుముగల్గు
చిన్ని చనుల వన్నెలాడి - చూచితిన్. "
అని ప్రత్యుత్తరమిచ్చెను. “నేను వలచినకాంత యవయవములను నీ వట్లు వర్ణిం