గ్రామ్యభాషా గ్రంథ పఠనము
11
చూచుటకై వ్యాసములలోఁ బరీక్షలా? మీరు చెప్పనప్పుడు వారు చదువుకొననప్పుడెక్కడ నుండి భాషాపరిజ్ఞానము రాఁగలదు? భాషాగ్రంథములు చదువకుండ భాషాపరిజ్ఞానము గల్గుసాధన మేమైన నున్నదా? ప్రవేశ పరీక్షకుఁ గాఁబోలు పూర్వము రద్దుచేయఁబడిన యాంగ్లేయభాషాపఠన గ్రంథము తిరుగ నేల యంగీకరింపఁబడినది? భాషాగ్రంథపఠనము లేకుండ భాషాభిజ్ఞానము కలుగదను సంగతి యాంగ్లేయభాషకు నిజమైనప్పుడది దేశభాషల కన్యథా యగునా? ఆంగ్లేయభాష నుద్ధరించుటకై యిప్పుడు తిరుగ గ్రంథపఠన మనివార్యము చేసినట్లే దేశభాషలఁజావకుండఁ జేయుటకై యిప్పుడుకూడ నట్లు చేయరాదా? చేయుట న్యాయము కాదా? భాషాగ్రంథపఠనము లేకుండ భాషాభిజ్ఞానము లేదు. లేనప్పుడు లభింపని భాషాపరిజ్ఞానమునుగూర్చి వ్యాసపరీక్ష లేల? ఇవి యున్న లాభమేమి? ఇవి యుండుట లేనట్లుండుట కొఱకుఁ దప్ప నితర ప్రయోజన మేమున్నది? అదిగాక కన్నులకు గంతలు గట్టి కాదంబరి చదివిన బహుమతి నిత్తునని చెప్పిన నెవఁడైనఁ జదువఁగలఁడా? కలకత్తాలో నున్నవానికిఁ గాళ్లకుఁ గట్టులుగట్టి కాశికిఁ బర్వెత్తిన యెడల గౌరవపత్రిక నిచ్చెదనని యనునెడల నాతఁడు పరుగెత్తఁ గలఁడా? సాధనములఁ జంపినతర్వాత ఫలములోఁ బరీక్ష యెట్లు? చేతిలోని కలము లాగుకొనిన పిమ్మట వ్రాఁత పరీక్ష యుపయోగమున్నదా? వ్యాసలేఖనము సామాన్యమే! ఎన్ని భాషాగ్రంథములు చదువవలయును? ఎన్ని మారులు చదువవలయును? ఎందరచేతఁ జెప్పించుకొనవలయును? ఎన్ని తప్పుటడుగులు వేయవలయును? ఎన్ని పాటులు పడవలయును? ఎన్ని వంకగీఁతలు గీయవలయును? ఎన్ని మొట్లు తినవలయును? భాషా పరిజ్ఞానసారమును ప్రపంచ జ్ఞానసారమునగు వ్యాసలేఖనము పదునారు, పదునేడు సంవత్సరముల బాలునకు నిరాధారముగ, నిష్క్రయత్నముగ, నిస్సాధనముగ, నాకాశ పంచాంగముగ రాఁగలదా? అన్ని దివ్యగ్రంథముల వ్రాసిన నాంగ్లేయగ్రంథకర్త లందఱు భాషాపఠనసాహాయ్యముననేకదా యట్టి యపూర్వలేఖనము నభ్యసింపఁ గలిగిరి? నేల వదలిన సాము, భాష వదలిన లేఖనముండునా? నీళ్లలోఁబడి యొకప్పు డుక్కిరిబిక్కిరి యయి యటు కొట్టుకొని యిటుకొట్టుకొని మునిఁగి తేలి చేతులు కాళ్లు జాడించి తన్నుఁ గ్రమక్రమముగఁ దేల్చుకొని బారవేయఁగలవానికే యీఁతలోఁ బరీక్షకాని, యొడ్డునఁ గాళులు తడియకుండఁ గూర్చుండువానికిఁ బరీక్ష గలదా? అటులే దేశీయభాషామహాగ్రంథ సుధార్ణవమునఁ బడి తద్రసమును గొంత యుక్కిరిబిక్కిరి యగునట్లు త్రాగి యనేక సంవత్సరములు క్రిందుమీఁదుగ గింజుకొని తత్సన్నివేశమున కలవాటుపడి కడతేఱినవానికే వ్యాసలేఖనమునఁ బరీక్షగాని భాషను దరిఁజేరనివానికిఁ గలదా? వ్యాసలేఖనకు గ్రంథపఠన సాహాయ్యము తప్ప నితరసాధన మేమైన నుండుట కవకాశ మున్నదా? (Guides to Composition) (గయిడ్స్ టు కాంపోజిషన్) అని యింగ్లీషువారిలో గ్రంథములున్నవి కాని మనలో లేవుగద? అవి యుండి వారికెంత యుపయోగమో యవి లేకున్న మనకంతియే నష్టముకదా? అట్టి గ్రంథములు వ్రాఁతపద్ధతులను స్వల్పముగఁ జెప్పునుగాని భాషాసామర్థ్య మీయఁగలవా? అదిగాక గంగాప్రవాహమువంటి లేఖన ధోరణి యట్టిపద్ధతులకు లొంగునా? పాకశాస్త్రము చూచి ప్రొయ్యిలో నిప్పువేయువాఁడు తన్నుఁ గాల్చుకొనుటకు, గుణపాఠము చూచి వైద్యము చేయునాఁ డితరులను గాల్చుటకే కదా? కావున వ్యాసలేఖన మెప్పుడు పరీక్షార్హమో భాషాగ్రంథము లప్పుడే నిర్బంధపఠనీయార్హములు కాక తప్పదు.
నేను-దీని నిప్పుడట్లు చేసినయెడల నిర్బంధపఠనార్హ విషయము సంఖ్య