పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాక్షి సంఘనిర్మాణము

3

తులసిపూసలపేరులు! ఆహా! మనుష్యచర్య లెంత విరుద్ధముగ మాఱియున్నవి! ముద్దులో ముక్కూడఁబీఁకుట. కౌఁగిలింతలో గొంతుకోఁత, సాలగ్రామతీర్థములో సౌవీరపాషాణముగ నున్నవికదా? ప్రకృతి యెంత తలక్రిందయినట్లున్నది! అమృతమేదో, హాలాహలమేదో, పూలబంతి యేదో, తుపాకిగుండేదో, నమస్కార మేదో, నెత్తిపెట్టేదో, మంచి యేదో, చెడ్డ యేదో, మిత్రుఁ డెవఁడో, శత్రుఁ డెవఁడో, స్వర్గ మేదో, నరక మేదో, పరమేశ్వరుఁ డెవఁడో, బ్రహ్మరాక్షసుఁ డెవ్వడో - భేదమంతయు నశించినది కదా!

తమకు బహుస్వల్పలాభమే కాని యితరుల కెంతమాత్రమును నష్టము లేని సామాన్యజీవయాత్రా వ్యాపారములలో మాత్రమే మనుష్యులిట్లు సత్యానుభవాచ్చాదనము, మిథ్యానుభవ సంధానము స్వప్రకృతి సంఛాదనము, పరప్రకృతి స్వీకారము సేయుచున్నా రేమో యనఁగ నట్లు కాదు.

మాన న్యాయ్య ధన ప్రాణాదివిషయములగు వ్యాపారములఁ గూడ నిట్టిమహేంద్రజాలవిద్యనే కనఁబఱచుచున్నారు! మనసును దిగంబరముగఁ జేయువాఁడు మందుఁడు. సత్య మసత్య మను నూఁతకోల లేక నడువ లేదని మనవారు నమ్మియున్నారు. పతిప్రక్కలో మాయ! భ్రాతలపాలిలో మాయ! న్యాయాధికారి కలములో మాయ! న్యాయవాది నాలుకకొనను మాయ! వణిజుని త్రాసులో మాయ! వసుధాకర్షకుని నాగేటిలో మాయ! ఎక్కడఁ జూచిన మాయ!! ప్రపంచమున నెవ్వరు సత్యవంతులు? యోగ్యులు లేరా? ఉన్నారు. కొలఁదిగ పరకపాటుగ, ఆఫ్రికాయెడారిలో ఫలవంతములగు ప్రదేశములవలె నున్నారు. ప్రతి వ్యాపారములోను మహానుభావు లుత్తమోత్తము లున్నారు. ఇట్టివా రుండుటచేతనే యింక ప్రపంచ ముల్లోలకల్లోల మొందకయున్నది. ఒక్క రావణాసురుని వధించుటకుఁ బరమాత్మ యంత వాఁడు, రామునియంతవాని యవతార మొంది పడరాని కష్టములఁ బడి తుదకుఁ గృతార్థుఁ డయ్యెను! అందఱు రావణాసురు లయినయెడల నతని యవతారపుటాట సాగునా? ఇంక - నట్టిదురవస్థ రాలేదు. పరమార్థ వంతులు కొంద ఱున్నారు. వారే లేకుండునెడల ద్వాదశార్కు లుదయింప వలసినదే! పుష్కలావర్త మేఘములు తెగిపడి వర్షింపవలసినదే! బ్రహ్మ పునస్సృష్టికై తిరుగ నడుసుఁ ద్రొక్కవలసినదే!-

ఇఁక మనుష్యు లొనర్చు నేరములు మొదలగువానిఁగూర్చి కొంత విచారింతము. పెట్టిన న్యాయస్థానములను బెట్టుచునేయున్నారు. వేసిన న్యాయాధిపతులను వేయుచునే యున్నారు. చేర్చుకొనిన న్యాయవాదులను జేర్చుకొనుచునే యున్నారు. పెరుగుచున్న వ్యాజ్యెములు పెరుగుచునే యున్నవి. పెంచుచున్న శిక్షాశాసన శాస్త్రములను బెంచుచునే యున్నారు. పెంచుచున్న రక్షకభట సంఖ్యను బెంచుచునే యున్నారు. పెరుగుచున్న నేరములు పెరుగుచునేయున్నవి. కట్టించుచున్న కారాగృహములు గట్టించుచునేయున్నారు. ఎదుగుచున్న కారాబద్ధుల సంఖ్య యెదుగుచునే యున్నది. నరహత్య చేసిన వారిని జంపుటకు నానా విధ యంత్రములు కల్పించుచునేయున్నారు. హత్యలు వృద్ధియగుచునే యున్నవి. నేరము శిక్షనొందినకొలఁది వృద్ధినొందుచున్నట్లున్నది. నేరమొనర్చుటవలన బీదల కన్నము దొరకుచున్నది.

అయినను బ్రత్యేక రాజకీయదండనము మాత్రమే నేరము నణగఁద్రొక్కఁజాలదు. దానికిఁ దోడు సంఘశిక్ష యుండవలయును. సంఘశిక్ష యనఁగ నేరగానితో నెవ్వరు