పుట:సర్వలక్షణసారసంగ్రహము.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్వలక్షణసారసంగ్రహము

89

గోరునకు

ఉ.

కారణ మేమి రక్కసు నఖంబుల వ్రచ్చితి నాడు నీకుఁ బెం
పార కుఠార మబ్బదొ పురారివిరించులు చేరి యేఁటికిన్
గోరున బోవు సేఁతలకు గొడ్డలియన్న దొరంగితో వినం
గోరెదనన్నయిందిరకు గోరిక లిచ్చుముకుందుఁ గొల్చెదన్.

65

కంచిరాజు సూరయ కన్నప్పచరిత్ర

వ.

కడమ యీలాగే తెలుసుకొనునది.

13 లక్షణము

క.

ఒనరఁ దృతీయకు సప్తమి
కిని యొక్కడఁ బ్రథమ వచ్చుఁ గృతుల సుఖంబుం
డెను చిచ్చురికె ననంగా
ఘనతరగోరాట్తురంగ కలుషవిభంగా.

66

తృతీయకుఁ బ్రథమ వచ్చుటకు

సీ.గీ.

బ్రహ్మరతులు దపస్వులు భవ్యతీర్థ
సేవకులు సద్ర్వతులును నిస్పృహులు మొదలు
గాఁగ నొప్పెడు తత్పుణ్యకర్మపరులు
వీరె కనుగొందు సుఖమున్నవార లిందు.

67

కాశీఖండము

సప్తమికిఁ బ్రథమ వచ్చుటకు

గీ.

ఎన్నికకు రోమకూపంబు లెన్ని గలవు
దివ్యవర్షంబు లన్ని మోదించు సాధ్వి
నాకభువనంబునం దాత్మనాథుఁ గూడి