పుట:సర్వలక్షణసారసంగ్రహము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్వలక్షణసారసంగ్రహము

85


క.

మీపనుపున రాజ్యముపా
లీపాండుతమూభవులకు నీకున్న భుజా
టోపభయంకరుఁ డర్జును
కోపానల మడరి ముట్టుకొనదే వారిన్.

47

ఉద్యోగపర్వము

శా.

భారద్వాజపవిత్రగోత్రు విమలాపస్తంబసత్సూత్రు వి
ద్యారాజీవభవుండు మారయకుఁ బుజ్యాచార భీమాంబకున్
గారామైనతనూజు.....................................................

48

నైషధము

10 లక్షణము

క.

కదిసి ముకారాంతములగు
పదములపై సప్తమీవిభక్తి యొదవుచో
హ్రదమున హ్రదమునయందున్
హ్రదమందున్ హ్రదమునందు ననఁ జను శర్వా.

49


చ.

ఉరమునయందుఁ గన్నులు పృథూదరదేశమునందు నోరు బ్ర
స్ఫురితభుజద్వయంబు గులభూమిధరోన్నతభావముం గరం
బరుదుగ నుగ్రమైనవికృతాకృతితోడన శేషసత్వఘ
స్మరుఁడగుచున్నవానిఁ బటుసత్వుఁగబంధుని గాంచి రచ్చటన్.

50

ఆరణ్యపర్వము

మ.

హరుఁడా తారకశైలదుర్గమున నధ్యాసీనుఁడై రాజశే
ఖరవిఖ్యాతి వహించు చంద్రగిరిదుర్గంబందు శ్రీవేంకటే
శ్వరుఁ డొప్పున్ బహురాజశేఖర సదా సంసేవ్యుఁడై యారయన్