పుట:సర్వలక్షణసారసంగ్రహము.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

మంజువాణి


దౌవున నిల్చి మద్ఘనగదాపటువిక్రమతాడనంబులం
జేవయడంతు నెందు గురుశిక్షగదానుతి గాంతు రంగనల్!

22

జైమినీభారతము

కకారముమీఁద నై వచ్చుటకు

ఆ.

ఆరణి నగ్ని వొడముకరణి దేవకియందు
విప్రయజ్ఞకర్మ వేదగుప్తి
కై జనించె నెవ్వఁ డవ్వసుదేవనం
దను భజింతు నేకతానిరూఢి.

23

శాంతిపర్వము

6 లక్షణము

గీ.

లలితృతీయాదులగు విభక్తులకు నెల్ల
గలుగు మధ్య నకారంబు దొలఁగుచుండు
రాముచే రాముకొఱకు శ్రీరాముకంటె
రాముకును రామునందనరాజభూష.

24

తృతీయకు నకారలోప మగుటకు

ఉ.

హాటకగర్భుచేత గమలాసనుచే జతురాస్యకంథశృం
గాటకవీథికాకృతవిగాహచతుశ్రుతిచేత దేవతా
కోటికిరీటసంఘటితకోమలసాదసరోజుచే జగ
న్నాటకసూత్రుచేతఁ గృతినాథుఁడు గాంచు జిరాయురున్నతుల్.

25

నైషధము