పుట:సర్వలక్షణసారసంగ్రహము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

మంజువాణి


సీ.

శ్రేయో మనో యశస్తేజఃపదంబుల
                  కొనరంగ శ్రేయము మనము యశము
తేజమునాఁగ వర్తిల్లును మఱియు శ్రే
                  యస్సు మనస్సు యశస్సు నాఁగఁ
దేజ స్సనఁగ నొప్పు నోజఃపయోంభస్స
                  రశ్శబ్దములకుఁ జేరదు మువర్ణ
మరయ నోజస్సు పయస్సు నంభస్సు స
                  ర స్సనఁ దనరు బూర్శబ్దమునకు


గీ.

పురము కిమ్ శబ్దమునకును బొసఁగఁ గిమ్ము
జగ మనంగ జగ త్తనఁదగు జగత్ప
దంబునకు నిట్లు విలసిల్లుఁ దత్సమములు
కుంభిదైతేయమదనాశ కుక్కుటేశ.

22


గీ.

వరధనభుజంగకీరశాక్వరపదములు
వనము ధనము భుజంగము నొనర గీర
మును మఱియు శాక్వరము ననఁ దనరుచుండు
దురితభయనాశ రజతభూధరనివేశ.

23


క.

దూతపదము స్త్రీలింగము
రీతిం బుంలింగమట్లు గృతులఁ దనర్చున్
దూత యన దూతుఁ డనఁగా
భూతేశ మహేశ నిఖిలభువనాధీశా.

24

దూతయనుటకు

సీ.

నిత్యసత్యవ్రత నిషధేశ నీవు మా
                  కమరంగ దూతవై యభిమతంబు... ....

25

అరణ్యపర్వము