పుట:సర్వలక్షణసారసంగ్రహము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్వలక్షణసారసంగ్రహము

21


గీ.

సవతి కద్రువ శేషతక్షకులు మొదలు
గాఁగ వేవురు భుజగపుంగవులఁ గాంచె
నండముల రెంటిఁ గలధౌతగండశైల
సన్నిభంబులఁ గనెఁ బుణ్యసాధ్వి వినత.

23

కాశీఖండము

కొనెననుటకు

మ.

అసమస్థేమకిరీటి పాశుపతదీక్షారంభముం గైకొనెన్.

24

హరివిలాసము

ఉ.

పూని ముకుందునాజ్ఞ కనుబొమ్మనె గాంచి యజాండభాండముల్
వాననుమీఁదఁ బోవ నడవంగొనెఁదన్న ననగ్రనిశ్చల
త్వానుచలత్వనిష్ఠలె సమస్తజగంబుల జాడ్యచేతనల్
గా నుతి కెక్కు సైన్యపతి కాంచనవేత్రము నాశ్రయించెదన్.

25

ఆముక్తమాల్యద

ఇది పంచవిధాంధ్రలక్షణం బింక తద్వర్ణప్రకారంబుఁ జెప్పెద.