పుట:సర్వలక్షణసారసంగ్రహము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

మంజువాణి

అచ్చతెనుంగుప్రకరణము

క.

సూరిజను ల్లోకవ్యవ
హారంబగుబాస దేశ్య మం డ్రదియె హితం
బారఁగ నచ్చతెనుంగని
యారూఢిగఁ గొంద ఱంద్రు రగజాధీశా.

1


గీ.

తగిలి వర్ణంబు లెక్కువతక్కువలుగ
నియమ మెడలించి పల్కు నవియె తలంప
గ్రామ్య మగుచుండె నొరుల దెగడెడుచోట్లఁ
జెప్పఁదగు నది కలధౌతశిఖరిసదన.

2


ఆ.

ప్రాకటముగ గృతుల నాకడ నీకడ
యనుచుఁ బల్కుచోట నాడ నీడ
యనిన వర్ణలోప మగు ఫలములకు ఫ
లా లనంగ హెచ్చు నీలకంఠ.

3

ఇటువంటి గ్రామ్యపదంబు లయినను సుశబ్దంబు లగుట కుదాహరణ మహాకవి ప్రయోగము.

చ.

అసమున మీఁ దెఱుంగక మహాగ్రహవృత్తిఁ గడంగి చెచ్చెరం
బసులను గాయఁగాఁ జనియె బాపఁడు గౌరవసేన యేడ యొం
టి సనుట యేడ నా కిది కడిందివిచారము పుట్టె సైన్యమున్
వెసఁజని తోడు గావలయు వేగమె పంపుడు చాలునట్లుగన్.

4

విరాటపర్వము

చ.

అని మది మెచ్చి యొచ్చ మొకయందును లేని మనోహరాంగముల్
గనుఁగొని మౌనికావ్రతముఁ గైకొనియుండెడినన్ను నేల తో
డ్కొని యిటఁ దెచ్చెనీ వెడగు కోమలి భూజగ మేడ మారుతా