పుట:సర్వలక్షణసారసంగ్రహము.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్వలక్షణసారసంగ్రహము

133


ఉ.

ఆకరివేల్పుసామిచరణాబ్జములం జనియించినారు మం
దాకినితోడునీడలయినారు నిజమ్ముగఁ గమ్మకట్టు దా
మై కమనీయకీర్తి మహిమాతిశయంబుల మించినారు భ
ద్రాకృతు లద్రిధీరులు ప్రభాద్రులు మాద్రులు శూద్రు లప్పురిన్.

37

తెనాలి రామలింగయ హరివిలాసము

క.

కడుదడవు నిద్రపోతిం
బడతీ నను దెలుపవలదె మఱియొక్కరుఁ డె
క్కుడుజవమునఁ బట్టి బలం
బెడలఁగ ననుఁ దిగిచె నాతఁ డెవ్వఁడు చెపుమా.

38

అరణ్యపర్వము

సంయుక్తవళ్ళకు

10 లక్షణము

ఆ.

వళులపట్ల ద్విత్వవర్ణంబు నిలిచిన
నిరుదెఱంగు యతికిఁ బరగుచుండు
క్ష్మావిభుండు భువనమహితయశుం డన
క్ష్మాశతాంగ దక్షసవనభంగ.

39


సీ.

నందీశ్వరక్షిప్తనారంగఫలపాక
                  తరలవిద్యాధరీస్తనభరములు.........

40

శ్రీనాథుని హరవిలాసము

[1]స్త్నానశబ్దము స త న కారములకు సంయుక్తయతికిఁ జెల్లును.

ఉ.

స్త్నానముఁ జేసి ధౌతపరిధానముఁ గట్టి...........

41

హరవిలాసము

  1. స్నానశబ్దములో తకారము కలదనుట విచారణీయము.