పుట:సర్వలక్షణసారసంగ్రహము.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

మంజువాణి


క.

[1]ఈకృష్ణునిసారథ్యము
నాకృష్ణుని గాండివంబునై దోపక ము
న్నీకొలఁదిఁ జక్కఁబడి నీ
వీకురువంశంబు గావు మిభపురనాథా.

9

ఉద్యోగపర్వము

3 లక్షణము

గీ.

ఆంధ్రగీర్వాణముల నొకయక్షరమున
కంటి వచ్చిన క్రారల కరయ మైత్రి
జెల్లు ప్రాసంబులను గూర్పఁ దెల్లమిగను
బన్నగాధీశకేయూరభయవిదూర.

10


క.

యేప్రొద్దు శూద్రముని విగ|
తప్రాణుం జేసి తీవు ధర్మనిరతి నా
విప్రశిశువు చైతన్యం
బాప్రొద్ద యనూనముగ సమాహితమయ్యెన్.

11

ఉత్తరరామాయణము

4 లక్షణము

గీ.

[2]కబ్బముల కౢప్తియనుస్వర ల్కార మితర
హల్లుతో ప్రాసముల గూర్పఁ జెల్లు మును మ
హాకవీంద్రులు గడఁగి పద్యముల నిలుపు
టల నుమాధీశ పీఠపట్టణనివేశ.

12
  1. చావరు, ఈకృష్ణుని ఈరెండుదాహరణములు వ్యర్థములు.
  2. కబ్బముల ననులక్షణము నుదాహరణమును సంగతములు గావు.