పుట:సర్వలక్షణసారసంగ్రహము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

మంజువాణి


సీ.

ఒకయింత యొఱగినసీకమీఁద ముడి పువ్వు
                  టెత్తులు వలయు తాయెతులఁ జుట్టి

39

చంద్రభానుచరిత్ర

మొగమనుటకు

సీ.

అలచెందొనలవిందు చెలువెందు వెలి జిందు
                  మొగమున కొకవింతజిగి దొలంకె

40

పారిజాతాపహరణము

సీ.

పురుషునీగికి స్వల్పముననె సంతోషింతు
                  మొగ మెత్తనేరవు మగనియెదుట.

41

కాశీఖండము

క.

సగరసుతు లట్లు జగముల
కొగి బాధలు సేయుచున్న నోడి మరుత్ప
న్నగవరు లరిగిరి నాలుగు
మొగములుగల వేల్పుకడకు మునిసంఘముతోన్.

42

భారతము-అరణ్యపర్వము

మొకమనుటకు

చ.

విక విక నవ్వి యక్కపటవిప్రకుమారుఁడు మేలు లెస్సవా
నికినయి రాగబంధమున నిల్పె మదిం దరలాయతాక్షి మీ
సకీయ వివాహవేళఁ బురశాసనుపాణిఁ బరిగ్రహించుచో
మొకమున బుస్సురంచు నహి మోగిన నెట్లు భయంబు నొందునో.

43

శ్రీనాథుని హరివిలాసము