పుట:సర్వలక్షణసారసంగ్రహము.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్వలక్షణసారసంగ్రహము

105


చ.

[1]అపుడు పురంధ్రివర్గవృతయై చరణాంకకృతార్ధమైన క
ప్రఁపునునుమ్రుగ్గుపై మకరపద్మము లేర్పడ వీక్షణప్రభా
స్నపనవిచిత్రకుట్టిమమునన్ వరనీరనిధుల్ జనింప న
న్నృపమణి భాగ్యలక్ష్మికరణిం దరుణీమణి వచ్చె నొయ్యనన్.

33

వసుచరిత్ర

మ.

కనకక్షోణిధరంబు కార్ముకముగా కద్రూతనూజుండు సిం
జినిగా మాధవుఁ డమ్ముగాఁ బురముల క్షీణైకదోశ్శక్తిఁ గె
ల్చినజోదీశ్వరుఁ డిచ్చుగాత జయలక్ష్మీసుస్థిరైశ్వర్యశో
భనముల్ పెద్దయసింగమంత్రికి జగతఖ్యా తసత్కీర్తికిన్.

34

నైషధము

ఇది సమాసప్రకరణం బింక క్రియలు విశేషణం బెఱింగించెద.

  1. పురంధ్రిభిశ్చక్రమశః ప్రయుక్తం అని కాళిదాసుగా రికారాంతముగాఁ బ్రయోగించినారు.