పుట:సత్యశోధన.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

69

“తప్పక వెళతాను. ఆ క్రొత్త ప్రపంచం చూడకుండా ఇండియాకు తిరిగి వెళతానా?” “అయితే డబ్బు?” “నాకు డబ్బుతో పనిలేదు. నాకు మీవలె అవసరాలు ఉండవు. నేను తినేదెంత?” నా పుస్తకాలిచ్చే డబ్బు నాకు చాలు. మిత్రులిచ్చేది చాలు. నేను మూడవ తరగతిలోనే ప్రయాణం చేస్తాను. అమెరికా వెళితే డెక్‌మీదే వెళతాను.

ఇదీ నారాయణ హేమచంద్రుని విధానం. ఆ విధానం ఆయన సొంతం. అందుకు తగిన మంచి మనస్సు ఆయనకుంది. గర్వం ఏమాత్రము లేదు. అయితే ఆయనకు తన శక్తిమీద మోతాదుకు మించిన విశ్వాసం ఉందని నా అభిప్రాయం.

మేము రోజూ కలిసేవాళ్ళం. మా పనుల్లో కొంత పోలిక ఉంది. మేమిద్దరం శాకాహారులం. తరచు మేమిద్దరం ఒకేచోట భోజనం చేసేవాళ్ళం. ఇంట్లో సొంతంగా వండుకొని నేను కాలం గడుపుతున్న రోజులవి. వారానికి 17 షిల్లింగులు మాత్రమే ఖర్చు అవుతున్నది. ఆయన గదికి నేను, నా గదికి ఆయన అప్పడప్పుడు వస్తూపోతూ వుండేవారం. నా వంటకం ఇంగ్లీషువారి మాదిరిది. ఆయనకు ఇది నచ్చదు. ఆయనకు హిందూ మాదిరి వంటకాలు కావాలి. పప్పులేందే ఆయనకు ముద్ద దిగదు. నేను ముల్లంగితో సూపు తయారు చేస్తే ఆయనకు గుటక దిగేది కాదు. ఒకనాడు ఎలా సంపాదించారో ఏమో వేరుశెనగ పప్పు తెచ్చి నాకు వండి పెట్టడానికి సిద్ధపడ్డారు. నేను లొట్టలు వేస్తూ ఆయన వంటకం తిన్నాను. ఈ విధంగా నాకు ఆయన, ఆయనకు నేను వంటచేసి పెట్టడం అలవాటు అయిపోయింది. ఆ రోజుల్లో కార్డినల్ మానింగ్ వారి పేరు ప్రతివారి నోటిమీద ఆడుతూ వుంది. నౌకాశ్రయంలో పనివాళ్ళు సమ్మెకట్టారు. జాన్ బరన్సు గారు, కార్డినల్ మానింగ్ గారు పూనుకొని ఆ సమ్మెని ఆపివేశారు. మానింగ్‌గారి నిరాడంబర జీవితాన్ని గురించి డిజరాలీ మంత్రిగారి అభినందనల్ని గురించి నేను హేమచంద్రునికి చెప్పాను. “నేనా సాధు పురుషుణ్ణి చూచితీరాలి”. అని అన్నారు. హేమచంద్రుడు.

“అతడు చాలా గొప్పవాడు. మీరెట్లా చూడగలరు?”

“తేలిగ్గా చూస్తా. దానికి మార్గం చెబుతా, నేనొక రచయితను. రచయితగా ఆయన పరోపకార పారీణతకు స్వయంగా కలిసి ధన్యవాదాలు చెబుతాననడం ఒక పద్ధతి. నాకు ఇంగ్లీషురాదు గనుక నిన్ను దుబాసీగా తీసుకు వస్తున్నట్లు కబురుచేద్దాం. నేను చెప్పినదంతా చేర్చి ఆయనకు నీవు ఒక జాబు వ్రాయి. తెలిసిందా?”

నేను ఆయన చెప్పినట్లు జాబు వ్రాశాను. రెండుమూడు రోజుల్లో సమయం నిర్ణయించ కలుసుకోవడానికి అంగీకారం తెలుపుతూ కార్డినల్ మానింగ్‌గారు మాకు