పుట:సత్యశోధన.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

నారాయణ హేమచంద్రుడు

బక్కపలుచని శరీరం, మనిషి పొట్టి. గుండ్రని ఆయన ముఖం మీద మశూచి మచ్చలు. ముక్కు కొన తేలిలేదు, మొద్దుబారీ లేదు. మాటిమాటికీ ఆయన చేత్తో గడ్డం నిమురుకుంటూ వుండేవారు.

నాగరిక సంఘం ఆయనను అంగీకరిస్తుందా? తప్పక వేలు పెట్టి చూపిస్తుంది,

“మిమ్మల్ని గురించి నేను విన్నాను. మీ గ్రంథాలు కొన్ని చదివాను. మీరు మా యింటికి దయచేయరా!” అని అడిగాను. ఆయన కంఠం కొంచెం బండబారి వుంది. నవ్వుతూ మీ బస ఎక్కడ? అనే ప్రశ్నించారు.

“స్టోరువీధిలో”

“అయితే మనం ఒక గూటివాళ్ళమే. ఇంగ్లీషు చదువుకోవాలని వుంది. నేర్పుతారా?” “నాకు తెలిసినంతవరకు మీకు నేర్పడం ఇష్టమే. నా శక్తి కొద్దీ నేర్పుతాను. మీరు సరేనంటే నేనే మీ దగ్గరకు వస్తాను.” అని అన్నాను. సమయం నిర్ణయించాం. త్వరలోనే మామధ్య మంచి స్నేహం కుదిరింది..

నారాయణ హేమచంద్రునికి వ్యాకరణం రాదు. ఆయన దృష్టిలో గుర్రం క్రియ, పరుగెత్తడం విశేష్యం. ఇట్టి ఉదాహరణలు చాలా వున్నాయి. ఆయన అజ్ఞానం నాకు బోధపడలేదు. నా స్వల్ప వ్యాకరణ జ్ఞానం ఆయన మీద పారలేదు. వ్యాకరణం రాలేదనే బాధ ఆయనకు లేదు, “నేనెన్నడూ మీ వలె స్కూలుకు వెళ్ళలేదు. నా అభిప్రాయం వెల్లడించవలసివచ్చినప్పుడు వ్యాకరణం ఆవశ్యకత నాకు కలుగులేదు. సరే గాని మీకు బెంగాలీ వచ్చా?” నాకు వచ్చు. నేను బెంగాలుదేశంలో తిరిగాను. మహర్షి దేవేంద్రనాథఠాకూరు గ్రంథాలు గుజరాతీ వారికి అనువదించి నేను ఇచ్చాను. ఇతర భాషల్లో వున్న మహద్గ్రంధాల్ని గుజరాతీలోకి అనువదించి ఇవ్వాలి. నేను చేసే అనువాదం మక్కికి మక్కి వుండదు, భావానువాదం మాత్రం చేస్తాను. నాకు అదే తృప్తి. నా తరువాతి వాళ్ళు యింకా సవివరంగా చేస్తారు. వ్యాకరణసాయం లేకుండా గ్రహించింది నాకు చాలు. తృప్తోస్మి. నాకు మరాఠీ, హిందీ, బెంగాలీ వచ్చు. ఇప్పుడు ఇంగ్లీషు నేర్చుకుంటున్నాను. నాకు కావలసింది శబ్దాల పట్టిక. అంతటితో నాకు తృప్తి లేదు. నేను ఫ్రాన్సు వెళ్ళాలి. ఫ్రెంచి నేర్చుకోవాలి. ఫ్రెంచి భాషలో మహద్గ్రంథాలు చాలా ఉన్నాయని విన్నాను. వీలైతే జర్మనీ వెళ్ళాలి. ఆ భాష నేర్చుకోవాలి.” ఇదీ ఆయన ధోరణి. భాషలన్నింటిని చుట్టబెట్టి మ్రింగివేయాలని ఆయన ఆశ. ఇతర దేశాలు తిరగాలనే ఆశ కూడా అధికంగా వుంది.

“అయితే మీరు అమెరికా కూడా వెళతారా?”