పుట:సత్యశోధన.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

65

లండనులోని భారతీయులంతా ఆయన శవపేటికతో పాటు వెళ్ళారు. అంత్యక్రియలు చూద్దామని నేను, మరికొందరు పాదరీలతోబాటు వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడు రైలు కోసం స్టేషనులో వేచి వున్నాము. అక్కడ ఒక నాస్తిక భావాలుగల వ్యక్తి, ప్రక్కనే వున్న పాదరీని చూచి దేవుడున్నాడా? అని ప్రశ్నించాడు. ఉన్నాడు అని పాదరీ జవాబిచ్చాడు. “భూమి చుట్టుకొలత 78,000 మైళ్లు అని మీరు అంగీకరిస్తారా” అని నాస్తికుడు పాదరీని పరాజయం పాలుచేయాలనే భావంతో అడిగాడు.

“అంగీకరిస్తాను” అని పాదరీ అన్నాడు.

అయితే అయ్యా చెప్పండి, భగవంతుని కొలత ఎంత? ఆయన ఎక్కడ ఉన్నాడు.

“ఆయన మనిద్దరి హృదయాల్లోనూ వున్నాడు. అయితే ఆయనను తెలుసుకోగలగాలి అంతే”

“ఏమండీ! యింకా పసివాణ్ణనే భావిస్తున్నారా? అంటూ తాను విజయం పొందినట్లు ఫోజు పెట్టి తలపంకించి చూచాడు. పాదరీ వినమ్రతతో మౌనం వహించి ఊరుకున్నాడు.

ఈ సంభాషణ కూడా నాకు నాస్తికమతం యెడగల అరుచిని పెంచింది.


21. నిర్బలుడికి బలం రాముడే

నాకు హిందూ మతంతోను ప్రపంచమందలి ఇతర మతాలతోను కొంచెం పరిచయం కలిగింది. కాని విషమ సమయంలో అజ్ఞానం ఉపయోగపడదని నేను గ్రహించలేదు. ఆపత్సమయంలో ఏ వస్తువు మనిషిని రక్షిస్తుందో ఆ వస్తువు మనిషికి కనబడదు. ఆపద తొలగడానికి అతని స్వభావమే కారణం అని కొందరు భావిస్తారు. ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వారు యోచిస్తున్నారు. కాని రక్షణ పొందినపుడు మాత్రం తనను తన సాధనయే రక్షించిందో లేక మరొకడెవడైనా రక్షించాడో తెలుసుకోలేరు. కొందరు తమ నిష్ఠాబలం గొప్పదని భావిస్తారు. కాని నిష్ఠాబలం ఆపత్సమయంలో ఎందుకూ కొరరాదు. అట్టి సమయంలో అనుభవం లేని శాస్త్రజ్ఞానం వృధా అవుతుంది.

కేవలం శాస్త్రజ్ఞాన ప్రయోజనం నాకు కొంతవరకు అర్థమైంది. ఆంగ్లదేశంలో అంతకు ముందు జరిగిన విషయాలలో నాకు రక్షణ ఎలా కలిగిందో చెప్పలేను. అప్పటికి నేను చిన్నవాణ్ణి, కాని ఇప్పుడు నాకు ఇరవైఏళ్ళు. గృహస్థాశ్రమ అనుభవం కూడా కలిగింది. పెళ్ళాం వున్నది. పిల్లవాడు కూడా పుట్టాడు.

నాకు బాగా గుర్తు, ఆంగ్లదేశంలో నేనున్న చివరి సంవత్సరం ఆది. 1890 పోర్టు