పుట:సత్యశోధన.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

అసత్య వ్రణం

గాని తప్పు దొర్లడం జరగలేదని గుర్తు. సత్యారాధకునికి మౌనం అవసరమని నాకు కలిగిన అనుభవం. సామాన్యంగా అబద్ధం చెప్పడం, తెలిసో తెలియకో అతిశయోక్తులు పలకడం, సత్యాల్ని మెరుగుపరచడం మనిషికి కలిగే సహజ దౌర్బల్యం. అయితే మితభాషి అర్థం లేని మాటలు మాట్లాడడు. ప్రతి మాట ఆచి తూచి మాట్లాడతాడు. మాట్లాడటానికి ఆరాటపడేవారిని మనం చూస్తుంటాము. మేమంటే మేము అని ఉపన్యాసాలిచ్చేందుకై అధ్యక్షుణ్ణి వత్తిడి చేస్తుంటారు. అనుమతి ఇవ్వగానే వక్త సామాన్యంగా సమయాన్ని అతిక్రమించడం జరుగుతుంది. ఇంకా సమయం కావాలని కోరుతూ ఉంటారు. అనుమతి ఇవ్వకపోయినా ఉపన్యసిస్తూనే ఉంటారు. ఇలా మాట్లాడేవారివల్ల మేలేమీ జరగదు. పైగా కాలహరణం జరుగుతుంది. అందువల్ల బిడియం నాకు డాలుగా పనిచేసింది. సత్యశోధనకు అది ఎంతగానో సహకరించింది.


19. అసత్యవ్రణం

నలభై ఏండ్ల క్రితం ఆంగ్ల దేశంలో హిందూ దేశ విద్యార్థుల సంఖ్య ఈ కాలాన్ని బట్టి చూస్తే చాలా తక్కువ. వారు వివాహితులైయుండి కూడా అక్కడ అవివాహితులమని చెప్పేవారు. అందుకు ఒక కారణం ఉంది. ఇంగ్లాండులో ప్రతి విద్యార్థి బ్రహ్మచారియే. వివాహో విద్యనాశాయ అను సూక్తి ననుసరించి ఇక్కడి వాళ్ళు విద్యార్థి దశలో పెండ్లి చేసుకోరు. పూర్వం మనదేశంలో కూడా మనం బ్రతికి యున్న కాలంలో విద్యార్థికి బ్రహ్మచారి అనే పేరు ఉండేది. మనకు బాల్య వివాహాలు వచ్చిపడ్డాయి. కాని ఇంగ్లాండులో బాల్య వివాహం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. భారతీయ విద్యార్థులు ఇంగ్లాండు వెళ్లిన తరువాత తమకు పెండ్లి అయిందని సిగ్గువల్ల అక్కడ చెప్పకోరు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఆ దేశంలో పెండ్లి అయిన మొగవాళ్ళు పెండ్లి కాని ఆడపిల్లలతో కలిసి మెలిసి తిరగకూడదు. తాము బసచేస్తున్న ఇళ్లవారికి తమకు పెండ్లి అయిందని తెలిస్తే వాళ్ళు తమ ఆడపిల్లలతో కలిసి మెలిసి తిరగనీయరు. కులాసాగా కబుర్లు చెప్పుకునేందుకు అవకాశం లభించదు. ఆ ఆమోద ప్రమోదాలు చాలావరకు దోషరహితంగా వుంటాయి. తల్లిదండ్రులకు కూడా ఈ విధమైన ఆమోద ప్రమోదాలు సమ్మతాలే. అక్కడ వరుడే తగిన వధువును వెతుక్కుంటాడు. అందువల్ల కన్యలు, యువకులు కూడా కలిసి మెలిసి ఉంటారు. అది అక్కడ స్వాభావికం. ఇంగ్లాండుకు వెళ్ళగానే హిందూదేశ యువకులు అక్కడి కన్యల మోహంలో పడి పెండ్లి కాలేదని చెబితే దాని పరిణామం భయంకరంగ ఉంటుంది. అట్టి గొడవలు అక్కడ అనేకం విన్నాను. భారతీయ యువకులు అసత్యం పలికి అక్కడి కన్యల