పుట:సత్యశోధన.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

మార్పులు

అక్కడికి వెళితే ఖర్చు చాలా అవుతుందనీ, పైగా కోర్సు చాలా పెద్దదనీ, కాలం బాగా లాగుతుందని తెలిసింది. మూడు సంవత్సరాలకంటే మించి నేను ఇంగ్లాండులో వుండటానికి వీలులేదు. “నీవు పెద్దపరీక్ష ప్యాసవాలనుకుంటే లండను మెట్రిక్యులేషన్‌కు కూర్చో. అయితే బాగా కష్టపడవలసి వస్తుంది. సామాన్యజ్ఞానం బాగా పెరుగుతుంది. ఖర్చు ఏమీ వుండదు” అని ఒక మిత్రుడు చెప్పాడు. ఈ సలహా నాకు నచ్చింది. కాని కోర్సు చూచేసరికి భయం వేసింది. లాటిన్ మరియు మరో భాషా జ్ఞానం చాలా అవసరం. లాటిన్ తెలిసినవాడు లా గ్రంథాల్ని తేలికగా ఆర్థం చేసుకుంటాడు. అంతేగాక ‘రోమన్ లా’ పరీక్షయందు ఒక ప్రశ్న పత్రం పూర్తిగా లాటిన్ భాషలోనే వుంటుంది. లాటిన్ నేర్చుకున్నందువల్ల ఇంగ్లీషు భాష మీద మంచి పట్టు లభిస్తుంది. అని కూడా ఆ మిత్రుడు చెప్పాడు. ఆయన మాటల ప్రభావం నా మీద బాగా పడింది. కష్టమైనా, సులభమైనా లాటిన్ నేర్చుకోవలసిందేనని నిర్ణయానికి వచ్చాను. ఫ్రెంచి నేర్చుకోవడం అదివరకే ప్రారంభించాను. దాన్ని పూర్తి చేయాలి. అందువల్ల రెండో భాషగా ఫ్రెంచి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. ప్రైవేటుగా నడుస్తున్న ఒక మెట్రిక్యులేషన్ క్లాసులో చేరాను. ఆరు నెలలకు ఒక్క పర్యాయం పరీక్ష నడుస్తుంది. అయిదు మాసాల గడువు వున్నది. శక్తికి మించిన పని అని అనిపించింది. సభ్యుడు కావాలని కృషి చేస్తున్న నేను చివరికి కష్టపడి చదివే విద్యార్థిగా మారిపోయాను. టైంటేబులు తయారు చేసుకున్నాను. ఒక్కొక్క నిమిషం మిగుల్చుకోసాగాను. అయితే ఇతర విషయాలతో బాటు లాటిన్ మరియు ఫ్రెంచి భాషల్లో సైతం నైపుణ్యం సంపాదించగలంతటి బుద్ధి వికాసం నాకు కలగలేదు. పరీక్షకు కూర్చున్నాను. లాటిన్‌లో తప్పిపోయాను. విచారం కలిగింది. కాని అధైర్యపడలేదు. లాటిన్ విషయంలో ఆసక్తి పెరిగింది. సైన్సులో మరో విషయం తీసుకుందామని నిర్ణయించాను. రసాయన శాస్త్రం ఒకటి ఉంది. ఆ సబ్జక్టు మీద ఆసక్తి బాగా పెంచుకోవాలని భావించాను. కాని ప్రయోగాలకు అవకాశం లేనందున అది కుదరలేదు. ఇండియాలో రసాయన శాస్త్రం కూడా నేను చదివాను. అందువల్ల లండను మెట్రిక్ కోసం రసాయన శాస్త్రం చదవాలని భావించాను. ఈ పర్యాయం ‘వెలుగు, వేడి’ అను విషయాలు ఎన్నుకున్నాను. అది తేలికేనని అనిపించింది.

పరీక్ష కోసం తయారీ ప్రారంభించాను. దానితోపాటు జీవితంలో సరళత్వం తేవడం ఇంకా అవసరమని భావించాను. నా కుటుంబ బీద పరిస్థితులకు ఇక్కడి నా జీవనసరళి అనుగుణ్యంగా లేదని తెలుసుకున్నాను. మా అన్నయ్య బీదతనాన్ని