పుట:సత్యశోధన.pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

434

ఒక సంభాషణ

వెళ్ళాము. ఆయన యిలా సంభాషణ ప్రారంభించాడు. “మీ యీ స్వదేశీ ఉద్యమం ఆరంభమైంది. ఆ ఉద్యమం వల్ల మిల్లు యజమానులం ఎంతో లాభం పొందాం. బట్టల ధర పెంచి వేశాం. ఎవ్వరూ ఏమీ అనలేని మాటలు మాట్లాడాం” అని అన్నాడు. “నేను ఆ విషయాన్ని గురించి విన్నాను. కాని అలా జరిగినందుకు విచారిస్తున్నాను” “మీ విచారం ఏమిటో ఎందుకో నాకు తెలుసు. మేము పరోపకారం చేసేందుకు వ్యాపారం చేయడం లేదు. డబ్బు సంపాదించడమే మా లక్ష్యం. మా భాగస్వాములకు మేము సమాధానం చెప్పాలి. వస్తువుల ధర వాటి గిరాకీ మీద ఆధారపడి వుంటుంది. దీనికి విరుద్ధంగా ఎవ్వడూ వెళ్ళలేడు. యీ ఉద్యమం వల్ల స్వదేశీ బట్టల ధర పెరుగుతుందని బెంగాలీలు తెలుసుకోవాలి” అని అన్నాడు.

“పాపం వాళ్ళు నా మాదిరిగా తేలికగా అందరినీ నమ్ముతారు. కనుక మిల్లు యాజమానులు స్వార్థపరులు కారని మోసం చేయరని స్వదేశీవస్త్రాల పేరిట విదేశీ వస్త్రాలు అమ్మరని వాళ్ళు విశ్వసించారు.” అని అన్నాను.

“మీరు అలా నమ్ముతారని నాకు తెలుసు. అందుకనే నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఇక్కడకు రావడానికి శ్రమపడ్డారు. అమాయకులైన బెంగాలీల వలె మోసంలో పడకండి” అని చెప్పి తన దగ్గర నేయబడుతున్న బట్టల నమూనాలు తెమ్మని ఒకరికి సైగ చేశాడు. మొదటి నమూనా రద్దీ అవి పారవేసే దూదితో నేయబడ్డ కంబళీ. దాన్ని చూపిస్తూ “చూడండి మేము దీన్ని కొత్తగా నేయించాం. ఇది బాగా అమ్ముడుపోతున్నది. రద్దీగా భావించబడే దూదితో తయారు చేయబడింది గనుక చవుకగా ఉంటుంది. వీటిని ఉత్తరాదికి కూడా పంపుతాం. మా ఏజంట్లు దేశం నాలుగు చెరగులా ఉన్నారు. అందువల్ల మాకు మీవంటి ఏజంట్ల అవసరం వుండదు. మరోమాట. మీ కంఠస్వరం చేరుకోని దూర దూర ప్రదేశాల్లో సైతం మా ఏజంట్లు వున్నారు. సామగ్రి అక్కడికి చేరుతుంది. భారతదేశానికి కావలసినంత బట్ట మేము తయారు చేస్తాం. అసలు స్వదేశీ అంటే ఉత్పాదనకు సంబంధించిన విషయం. మనకు అవసరమైన బట్ట మనం తయారు చేసుకోగలిగినప్పుడు మేలురకం బట్ట తయారు చేసుకోగలిగినప్పుడు, విదేశీ బట్టల దిగుమతి దానంతట అదే తగ్గిపోతుంది. అందువల్ల మీరు నడుపుతూ ఉన్న స్వదేశీ ఉద్యమం నడపవద్దని సలహా ఇస్తున్నాను. క్రొత్త మిల్లులు తెరిచేందుకు ప్రయత్నం చేయండి. మన దేశంలో స్వదేశీ వస్తువులు అమ్మకం చేసే ఉద్యమం సాగించడం అనవసరం. మనకు కావలసింది స్వదేశీ వస్తువుల ఉత్పత్తి. ఆ విషయం అర్థం చేసుకోండి.” అని అన్నాడు. నేను ఆ పనే