పుట:సత్యశోధన.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

386

ఖేడా సత్యాగ్రహం

విరమణ జరిగింది. మూడురోజులు మాత్రం నేను ఉపవాసం చేయవలసి వచ్చింది. యజమానులు కార్మికులకు మిఠాయిలు పంచారు. 21వ రోజున ఒడంబడిక కుదిరింది. ఒక ఉత్సవం జరిపారు. అందు యజమానులు, కమీషనరు కూడా పాల్గొన్నారు. మీరు గాంధీ చెప్పిన ప్రకారం నడుచుకోండి అని కమీషనరు వారికి చెప్పాడు. ఆ కమీషనరుతోనే జగడం పెట్టుకోవలసి వచ్చింది. అతడూ మారాడు. ఖేడాలో పార్టీవాళ్లను నా మాట వినవద్దని అతడే చెప్పాడు.

ఒక కరుణాజనకమైన విషయం యిక్కడ పేర్కొనడం అవసరమని భావిస్తున్నాను. యజమానులు తయారుచేయించిన మిఠాయిలు ఎక్కువగా వున్నందున వేలాదిమంది కార్మికులకు వాటిని ఎలా పంచాలా అని మీమాంస బయలుదేరింది. ఏ చెట్టు క్రింద కార్మికులు ప్రతిజ్ఞ చేశారో, అక్కడ 21 రోజులు నియమాన్ని పాటించిన కార్మికులంతా వరుసగా క్యూలో నిలబడి మిఠాయి తీసుకోవాలన్న నిర్ణయాన్ని అమాయకంగా నేను ఒప్పుకున్నాను. కార్మికులు ఒక్కుమ్మడిగా మిఠాయిల మీద విరుచుకుపడకుండా పంపిణీ జరుగుతుందని భావించాను. కాని పంపిణీ సరిగా జరగలేదు. రెండు మూడు నిమిషాలకే వరుసక్రమం పోయింది. కార్మిక నాయకులు ప్రయత్నించినా ప్రయోజనం కలుగలేదు. కార్మికులు తండాలు తండాలుగా విరుచుకుపడినందువల్ల కొంత మిఠాయి పాడైపోయింది. మిగిలిన మిఠాయి జాగ్రత్తగా సేఠ్ మిర్జాపూర్‌లోగల అంబాలాల్ గారి బంగాళాకు చేర్చారు. మరునాడు ఆ బంగాళా మైదానంలో మిఠాయి పంచవలసి వచ్చింది. చెట్టు దగ్గర మిఠాయి పంచుతున్నారని విని అహమదాబాదులో గల బిచ్చగాళ్లంతా వచ్చి మిఠాయి కోసం విరుచుకు పడినందున ఏర్పాట్లన్నీ చెల్లాచెదురయ్యాయని తరువాత తెలిసింది. ఇందు కరుణరసం ఇమిడి వున్నది.

ఆకలి అను రోగంతో బాధపడుతున్న దేశం మనది. తత్ఫలితంగా దేశంలో బిచ్చగాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. భోజనం దొరుకుతుంది అంటే అన్నార్తులు నియమాల్ని, నిబంధనల్ని పాటించవలసిన విధుల్ని మరిచిపోతారు. ధనవంతులు యిట్టి బిచ్చగాళ్లకు పని అప్పగించకుండా వాళ్లకు బిచ్చం యిచ్చి వాళ్ల సంఖ్యను బాగా పెంచుతున్నారు. 

23. ఖేడా సత్యాగ్రహం

కార్మికుల సమ్మె ముగిసింది. యిక నాకు ఒక్క నిమిషమైనా తీరిక చిక్కలేదు. వెంటనే ఖేడా జిల్లాలో సత్యాగ్రహం ప్రారంభించవలసి వచ్చింది. ఖేడా జిల్లాలో కరువు