పుట:సత్యశోధన.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

382

ఆశ్రమం

చూచి అర్థం చేసుకొనే అవకాశం లభించింది. శ్రీ అనసూయాబెన్‌ను గురించి అదివరకే నాకు తెలుసు. సమ్మె చేస్తున్న కార్మికుల సభలు నదీతీరాన ఒక చెట్టు క్రింద జరుగుతూ వుండేవి. వందల సంఖ్యలో కార్మికులు పాల్గొంటూ వుండేవారు. వారుచేసిన ప్రతిజ్ఞను వారికి నేను రోజూ జ్ఞాపకం చేస్తూ వుండేవాణ్ణి. శాంతి సంరక్షణ, వారి కుటుంబపోషణను గురించి రోజూ వారికి చెబుతూ వుండేవాణ్ణి. వాళ్లు తమ జండా పుచ్చుకొని పట్టణంలో రోజు తిరుగుతూ వుండేవారు. ఊరేగింపుగా వచ్చి సభలో పాల్గొంటూ వుండేవారు.

ఈ సమ్మె 21 రోజులు సాగింది. మధ్య మధ్య యజమానులతో నేను మాట్లాడుతూ వుండేవాణ్ణి. న్యాయం చేయమని కోరుతూ వుండేవాణ్ణి. “మాకు మాత్రం పట్టుదల లేదా? మాకు మా కార్మికులకు మధ్య తండ్రికొడుకుల వంటి సంబంధం వున్నది. మా యిద్దరి మధ్య మరొకరు కాలు యిరికించితే మేము ఎలా సహిస్తాం? యిందు పంచాయితీ పెద్దల ప్రమేయం ఎందుకు?” అని యజమానులు అంటూ వుండేవారు. 

21. ఆశ్రమం

కార్మికుల ప్రకరణానికి ముందు ఆశ్రమాన్ని గురించి కొద్దిగా వ్రాయడం అవసరం. చంపారన్‌లో వున్నా నేను ఆశ్రమాన్ని మరిచిపోలేదు. అప్పుడప్పుడు నేను అక్కడికి వెళ్లి వస్తూ వుండేవాణ్ణి. కోచరబ్ అహమదాబాదు సమీపంలో గల చిన్న గ్రామం. ఆశ్రమం యీ గ్రామంలోనే వున్నది. కోచరల్‌లో ప్లేగు ఆరంభమైంది. పిల్లల్ని ఆశ్రమంలో సురక్షితంగా వుంచలేని పరిస్థితి ఏర్పడింది. ఆశ్రమంలో పారిశుద్ధ్య నియమాన్ని ఎంతగా పాటించినా చుట్టుప్రక్కలగల మురికిని పోగొట్టడం సాధ్యంకాలేదు. కోచరల్‌లో గల ప్రజలకు నచ్చచెప్పడానికి, వారికి సేవ చేయడానికి మా శక్తి చాలలేదు. పట్టణానికి, ఆశ్రమాన్ని దూరంగా వుంచాలనేది మా ఆదర్శం. కాని రాకపోకలకు యిబ్బంది కలిగేలా వుండడం కూడా మాకు యిష్టంలేదు. ఆశ్రమం సొంతచోటులో తెరపగాలిలో, ఆశ్రమరూపంలో ఏదో ఒక రోజున నిర్మాణం కావాలి.

ప్లేగు వ్యాపించినప్పుడు కోచరల్‌ను వదిలివేయమని ఆదేశం అందినట్లు భావించాను. శ్రీ పూంజాభాయి హీరాచంద్‌గారికి మా ఆశ్రమంతో దగ్గర సంబంధం వుంది. ఆశ్రమానికి సంబంధించిన సేవా కార్యాలు శ్రద్ధగా ఆయన చేస్తూ వుండేవాడు. అహమదాబాదు ప్రజాజీవితం ఆయనకు బాగా తెలుసు. ఆశ్రమం కోసం భూమి బాధ్యత ఆయన వహించాడు. కోచరల్‌కు ఉత్తర దిశయందు భూమికోసం