పుట:సత్యశోధన.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

377

పరిచయం పెరిగింది. నాకు చదువుతో తృప్తి కలుగలేదు. గ్రామాలలో మురికి అధికంగా వున్నది. గ్రామం వీధుల్లో పెంటకుప్పలూ, బావుల దగ్గర బురద, దుర్వాసన యిళ్లముందు భరించలేని పరిస్థితులు. పెద్దలు కూడా పారిశుద్ధ్యాన్ని గరపడం అవసరమని భావించాను. చంపారన్ జనం రోగాలతో బాధపడుతున్నారు. సాధ్యమైనంతవరకు గ్రామ ప్రజలను సరియైన త్రోవకు తేవాలనీ, పారిశుద్ధ్యం నేర్పాలనీ, వారి జీవితంలో ప్రవేశించి కార్యకర్తలు వారికి సేవ చేయాలని నా అభిప్రాయం. యిందుకు డాక్టర్ సహాయం అవసరం. గోఖలేగారి సొసైటీకి చెందిన డాక్టర్ దేవ్ గారిని పంపమని కోరాను. వారికీ నాకూ ప్రేమ సంబంధం ఏర్పడింది. ఆరుమాసాల పాటు వారి సేవ లభించింది. వారి పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పనిచేయవలసి వచ్చింది. తెల్లదొరలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు పనిచేయవలసి వచ్చింది. తెల్లదొరలకు వ్యతిరేకంగా చేయబడుతున్న ఆరోపణల్లో పాల్గొనవద్దని, రాజకీయాల్లో పడవద్దని ఎవరైనా ఆరోపణలు చేసేవారు వస్తే నా దగ్గరకి పంపమని, మీ క్షేత్రం దాటి వెళ్లవద్దని అందరికీ చెప్పాను. చంపారన్‌లో యిట్టి అనుచరుల నియమబద్ధత అత్యద్భుతం. సూచనలను ఉల్లంఘించిన ఉదాహరణ ఒక్కటికూడా లేదు. 

18. గ్రామాలలో

ప్రతి పాఠశాలలో ఒక పురుషుణ్ణి ఒక మహిళను నియమించే ఏర్పాటుచేశాము. వారి ద్వారానే మందులు యిప్పించడం పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహింపచేయడం, మహిళల ద్వారా స్త్రీ సమాజంలో ప్రవేశించడం, మందులు ఇచ్చే పనిని తేలికగా నిర్వహించేలా చేయడం జరిగింది. క్వినైన్, పట్టీలు, ఆముదం ప్రతి స్కూల్లో వుంచాము. నాలుక మురికిగా వున్నా, అజీర్ణం చేసినా ఆముదం తాగించాలి. జ్వరం తగిలితే ఆముదం త్రాగించిన తరువాత క్వినైన్ యివ్వాలి. కురుపులు, గడ్డలు లేస్తే వాటిని కడిగి మలాం పట్టీ వేయాలి అని ఉపాధ్యాయులకు శిక్షణ యిచ్చాం. జబ్బు పెద్దదైతే డా. దేవ్‌గారికి చూపించి వారిచేత వైద్యం చేయించాలి. డా. దేవ్ వేరు వేరు సమయాల్లో వేరు వేరు గ్రామాలకు వెళ్లి రోగుల్ని పరీక్షిస్తూ వుండేవారు. యీ ఏర్పాటు వల్ల అధికసంఖ్యలో గ్రామ ప్రజలు ప్రయోజనం పొందసాగారు. సామాన్యంగా వచ్చే జబ్బులు కొద్దే. వాటికి పెద్ద పెద్ద డాక్టర్ల అవసరం వుండదు. యీ విషయాల్ని గ్రహిస్తే మేము చేసిన ఏర్పాటు ఎంతో ప్రయోజనకరమైనదని చెప్పవచ్చు. జనం మురికిని