పుట:సత్యశోధన.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

374

కార్య విధానం

ఆ రోజుల్లో మా సహచరుల అలవాట్లు విచిత్రంగా వుండేవి. నేను రూజీవారి ప్రవర్తనను గురించి ఛలోక్తులు విసురుతూ వుండేవాణ్ణి. వకీళ్ళ మండలికి వంట విడివిడిగా తయారవుతూ వుండేది. రాత్రిపూట 12 గంటల వరకు భోజనం చేస్తూ వుండేవారు. ఎవరి ఖర్చు వారు భరించినా నాకు వాళ్ల పద్ధతి నచ్చలేదు. మా అందరి మధ్య స్నేహబంధం గట్టిగా బిగుసుకున్నందున ఎవరెన్ని చెప్పినా, ఎవరేమన్నా మా బంధనం వదులుకాలేదు. నేను విసిరే మాటల బాణాల బాధను నవ్వుతూ వారు సహించేవారు. చివరికి నౌకర్లందరినీ పంపించివేయాలని, భోజన నియమాల్ని అంతా పాటించాలని నిర్ణయం చేశాం. అందరూ శాకాహారులు కారు. రెండు కుంపట్లు ప్రారంభిస్తే ఖర్చు పెరుగుతుంది. అందువల్ల ఒకే కుంపటి వెలగాలని, శాకాహార భోజనం తయారుచేయాలని, భోజనం బహుసాదాగా వుండాలని నిర్ణయించాం. దానితో ఖర్చు బాగా తగ్గిపోయింది, కార్యశక్తి పెరిగింది. సమయం కూడా బాగా కలిసివచ్చింది.

మా పని బాగా పెరిగిపోయింది. రైతులు గుంపులు గుంపులుగా వచ్చి తమ గాధలు వ్రాయించసాగారు. వ్రాసుకునేవారి దగ్గర గుంపులుగా జనం పెరిగిపోయారు. ఇల్లంతా జనంతో నిండిపోయింది. చూడడానికి వచ్చే జనాన్నుంచి నన్ను రక్షించడం కోసం నా సహచరులు ఎంతో శ్రమపడ్డారు. యిక గత్యంతరం లేక సమయం నిర్ధారించి నన్ను బయటకి తీసుకురాసాగారు. ఆరు లేక ఏడుగురు వకీళ్లు రైతులు చేప్పే కధలు రాసుకుంటూ వుండేవారు. అయినా సాయంకాలానికి రాతపని పూర్తి అయ్యేది కాదు. యింతమంది వాఙ్మూలాలు అనవసరం కాని వారు చెప్పింది రాసుకుంటే రైతులు తృప్తిపడతారు. కధలు వ్రాసేవారు కొన్ని నియమాల్ని పాటిస్తూ వుండేవారు. ప్రతి రైతును ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేవారు. సమాధానం సరిగా చెప్పలేని వారి వాఙ్మూలం రాసుకోకూడదనీ నిరాధారమైన కధలు కూడా రాసుకోకూడదనీ నిర్ణయించాం. అందువల్ల యదార్ధమైన గాధలు, ఆధారాలు గల కధలే రాసుకోవడం జరిగింది.

ఈ వాఙ్మూలాలు రాసుకునేటప్పుడు గూఢచారి పోలీసులు తప్పక వుండేవారు. మేము కావాలంటే వాళ్లు ఆగిపోయేవారే. కాని మేము వాళ్లను రానియ్యాలని, వారి విషయంలో వినమ్రంగా వ్యవహరించాలని, అవసరమైన సమాచారం వాళ్ళకు అందజేయాలని నిర్ణయించాం. వాళ్ల కండ్ల ఎదుట రైతులు కధలు చెబుతూ వుండేవారు. యిందువల్ల రైతులకు ధైర్యం వచ్చింది. గూఢచారి పోలీసులంటే జనం