పుట:సత్యశోధన.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

364

నీలిమందు మచ్చ

ఒక్క రోజు చాలు. మీ కండ్లతో అక్కడి రైతుల కడగండ్లు చూడండి అని శుక్లా అన్నాడు. నేను లక్నో నుండి కాన్పూర్ వెళ్ళాను. అక్కడికి కూడా రాజకుమార్ శుక్లా వచ్చాడు. యిక్కడికి చంపారన్ బాగా దగ్గర. ఇప్పుడే వచ్చి అక్కడ ఒక్కరోజు ఉండండి అన్నాడు. ఇప్పుడు నన్ను మన్నించండి నేను తప్పక వస్తాను. మాట యిస్తున్నాను అని ఇంకా ఎక్కువగా పట్టుబట్టాను. నేను ఆశ్రమం చేరుకున్నాను. రాజకుమార్ శుక్లా అక్కడికి కూడా వచ్చాడు. ఎప్పుడు వచ్చేది నిర్ణయించండి అని అన్నాడు. మీరు వెళ్ళండి. నేను ఫలానా తేదీన కలకత్తా వస్తాను. అక్కడికి వచ్చి నన్ను తీసుకువెళ్లండి అని చెప్పాను. అక్కడ ఎవరి దగ్గర వుండాలో, ఎవరిని చూడాలో కూడా నాకు తెలియదు. కలకత్తాలో భూపేన్ బాబుగారి ఇంట్లో బస చేద్దామని వెళ్ళాను. అక్కడ రాజకుమార్ శుక్లా ప్రత్యక్షమయ్యాడు. చదువురాని అమాయకంగా వున్న యీ పల్లెటూరి రైతు తన నిర్ణయాత్మక శక్తి ద్వారా నా హృదయం జయించాడు. 1917 ప్రారంభంలో మేమిద్దరం కలకత్తా నుండి బయలుదేరాం. మా యిద్దరి జోడా ఒకటిగా వున్నది. ఇద్దరం రైతుల్లా వున్నాం. ఇది నా మొదటి పాట్నా యాత్ర. తిన్నగా ఎవరి ఇంటికైనా వెళ్ళి బస చేద్దామంటే నాకు తెలిసినవారు అక్కడ ఎవ్వరూ లేదు. రాజకుమార్ శుక్లా చదువురాని రైతు. అయినప్పటికీ ఆయనకు తెలిసినవారు అక్కడ వుంటారనే అనుకున్నాను. రైల్లో ఆయనను కొంచెం ఎక్కువగా తెలుసుకొనే అవకాశం చిక్కింది. పాట్నాలో ఆయన రహస్యం బయటపడింది. రాజకుమార్ పూర్తిగా అమాయకుడు. ఆయన తన మిత్రుడని భావించిన వకీలు నిజానికి ఆయన మిత్రుడు కాడు. రాజకుమార్ శుక్లా ఆయనను ఆశ్రయించుకొని వున్నాడని తేలింది. కక్షిదారులగు రైతులకు, వకీళ్ళకు వుండే సంబంధం వర్షఋతువులో గంగానది ప్రవాహం వంటిది గదా! నన్ను ఆయన తిన్నగా రాజేన్‌బాబుగారింటికి తీసుకువెళ్ళాడు. రాజేన్‌బాబు పూరీ నగరమో లేక మరో చోటికో వెళ్ళారు. వారి బంగళాలోయిద్దరు నౌకర్లు ఉన్నారు. తినడానికి నాదగ్గర కొంత ఆహారపదార్థం ఉన్నది. కర్జూరం అవసరం అయింది. పాపం రాజకుమార్ శుక్లా బజారుకు వెళ్లి తెచ్చి పెట్టాడు.

బీహారులో అంటరానితనం అపరిమితంగా వున్నది. నా బాల్టీయందలి నీటి బొట్లు పడితే మైలపడతామని అక్కడి నౌకర్లు భావించారు. నా కులం ఏమిటో ఆ నౌకర్లకు తెలియదు! రాజకుమార్ లోపలి పాయిఖానా దొడ్డి ఉపయోగించమని నాకు చెప్పాడు. కానీ నౌకరు బయట ఉన్న పాయిఖానా దొడ్డిని వేలితో చూపించాడు. నాకు బాధ కలుగలేదు. కోపం రాలేదు. ఇలాంటి అనుభావాలు చాలా కలిగినందున నేను