పుట:సత్యశోధన.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

345

ఆండ్రూస్ బర్ద్వాను దాకా వచ్చారు, “హిందూ దేశంలో సత్యాగ్రహం చేయవలసి వస్తుందని మీరు భావిస్తున్నారా? అలా భావించితే ఎప్పుడు జరుగుతుందో ఊహిస్తున్నారా?” అని నన్ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జవాబివ్వడం కష్టం. ఒక్క ఏడాదిపాటు దేశమందంతట పర్యటించమని, ప్రజా సమస్యలను గురించి స్వయంగా తెలుసుకొని యోచించమని, నిర్ణయాలను మాత్రం వెంటనే ప్రకటించవద్దని గోఖలే చెప్పారు. సరేనని వారికి మాట యిచ్చాను. ఆ మాట మీద నిలబడి వుంటాను. ఆ తరువాత అవసరమైతేనే నా అభిప్రాయం వెల్లడిస్తాను. అందువల్ల అయిదు సంవత్సరాల వరకు సత్యాగ్రహం చేయవలసిన అవసరం కలగదని భావిస్తున్నాను” అని చెప్పాను.

ఇక్కడ మరో విషయం పేర్కొనడం మంచిది “హింద్‌స్వరాజ్” లో నేను ప్రకటించిన విషయాలను గోఖలేగారు ఎగతాళిచేస్తూ ఒక్క ఏడాదిపాటు దేశమంతా తిరిగిచూస్తే మీభావాలు వాటంతట అవే త్రోవకు వస్తాయి అని అన్నారు. 

5. బాధాకరమైన మూడోతరగతి ప్రయాణం

బర్ద్వాన్ చేరిన తరువాత మేము మూడో తరగతి టికెట్లు తీసుకోవాలి. చాలా యిబ్బంది కలిగింది. ‘మూడో తరగతి ప్రయాణీకులకు ముందుగా టికెట్లు యివ్వం’ అని అన్నారు. స్టేషను మాస్టరును కలుద్దామని వెళ్లాను. ఆయనను కలుసుకోనిస్తారా? ఎవరో దయతో స్టేషన్ మాస్టరును చూపించారు. ఆయన దగ్గరకు వెళ్ళాను. ఆయన కూడా ఆ సమాధానమే యిచ్చాడు. కిటికీ తెరిచిన తరువాత టికెట్లు తీసుకుందామని వెళ్ళాను. బలంగా వున్నవారంతా తోసుకొని ముందుకు వెళ్లి టికెట్లు తీసుకుంటున్నారు. నాబోటి వాళ్లను వెనక్కి నెట్టివేస్తున్నారు. చివరికి టికెట్లు దొరికాయి. బండి వచ్చింది. అక్కడ కూడా ఇదే తంతు. బలిష్టులు ఎక్కుతున్నారు. కూర్చున్నవారికీ, ఎక్కినవారికి ద్వంద్వయుద్ధం సాగుతున్నది. తోపుళ్లు నెట్టుళ్లు అమోఘంగా సాగుతున్నాయి. నాబోటివాడు తట్టుకోగలడా? మేము ముగ్గురం అటుయిటు పరుగులు ప్రారంభించాం. ప్రతిచోట “జాగాలేదు” అన్నమాటే వినబడుతున్నది. నేను గార్డు దగ్గరికి వెళ్లాను. “జాగా దొరికితే ఎక్కు లేకపోతే తరువాత బండిలోరా” అని ఆయన అన్నారు. ఏం చేయాలో తోచలేదు. మగన్‌లాలును ఏదోవిధంగా బండి ఎక్కమని చెప్పాను. భార్యతో సహా నేను మూడో తరగతి టిక్కెట్లతో ఇంటరు పెట్టెలోకి ఎక్కాను. గార్డు నన్ను చూచాడు. అసన్‌సోల్ స్టేషనులో బండి ఆగింది. గార్డు అదనపు రేటు వసూలు చేసేందుకై నా దగ్గరకు వచ్చాడు. ‘నాకు చోటు చూపించడం మీ కర్తవ్యం. చోటు