పుట:సత్యశోధన.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

330

గడుసుతనం

మాత్రం యిట్టి ప్రమాదానికి పూనుకోనని, కేసు విచారణ మళ్ళీ ప్రారంభమైతే కక్షిదారు డబ్బు బాగా ఖర్చు పెట్టవలసి వస్తుందని చివరకి తీర్పు ఎలా యిస్తారో చెప్పడం కష్టమని స్పష్టంగా చెప్పివేశాడు.

ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు కక్షిదారు అక్కడే వున్నాడు. “ఇట్టి ప్రమాదానికి సిద్ధపడక తప్పదు. మనం అంగీకరించకపోయినా పొరపాటు జరిగిందని తెలిసిన తరువాత, ఆ తీర్పు మీద కోర్టు నిలబడి వుంటుందని భావించడం సరికాదు కదా! పొరపాటును సరిదిద్దుకుంటున్నప్పుడు కక్షిదారు నష్టపడినా తప్పేమిటి” అని ప్రశ్నించాను.

“కాని మనం పొరపాటున అంగీకరించినప్పుడు గదా ఇదంతా?” అని అన్నాడు పెద్దవకీలు. ‘మనం అంగీకరించక పోయినా, కోర్టు జరిగిన పొరపాటును గ్రహించదని లేక ప్రతివాదులు యీ పొరపాటును కోర్టు దృష్టికి తీసుకురారని భావించడం సబబా?’ అని అడిగాను. పెద్ద వకీలు యిక ఒక నిర్ణయానికి వచ్చి “అయితే యీ కేసులో మీరు వాదించండి. పొరపాటును అంగీకరించే షరతుమీద అయితే నేను రాను. వాదనలో పాల్గొనను” అని చెప్పి వేశాడు.

“మీరు రాకపోయినా కక్షిదారుకోరితే నేను యీ కేసులో వాదిస్తాను. జరిగిన పొరపాటును అంగీకరించే షరతులమీదనే నేను వాదిస్తాను. అంగీకరించవద్దంటే మాత్రం నేను వాదించను.” అని చెప్పి వేశాను. ఆవిధంగా చెప్పి నేను కక్షిదారు వంక చూచాను. కక్షిదారు పెద్దచిక్కుల్లో పడ్డాడు. ఈ కేసు విషయమై మొదటి నుండి శ్రద్ధ వహించియున్నందున, కక్షిదారుకు నా మీద అమిత విశ్వాసం కలిగింది. నా స్వభావం కూడా అతడికి పూర్తిగా తెలుసు. కొద్ది సేపు ఆలోచించి అతడు ఒక నిర్ణయానికి వచ్చి “సరేనండీ. మీరే కోర్టులో వాదించండి. జరిగిన పొరపాటును అంగీకరించండి. ఓటమి నొసటన వ్రాసివుంటే ఓడిపోతాను. అన్నింటికీ సత్యరక్షకుడు ఆ రాముడే” అని అన్నాడు. నాకు పరమానందం కలిగింది. మరో విధంగా అతడు జవాబిస్తాడని నేను భావించలేదు. పెద్ద వకీలు నన్ను మరీమరీ హెచ్చరించాడు. మొండి పట్టుపడుతున్నందున నామీద జాలి కూడా పడ్డారు. చివరికి ధన్యవాదాలు తెలిపాడు. ఇక కోర్టులో ఏమి జరిగిందో తరువాత వివరిస్తాను. 

45. గడుసుతనం

నా సలహా యందలి ఔచిత్యాన్ని గురించి నాకు కొంచెం కూడా సందేహం కలుగలేదు. కాని ఆ కేసు విషయంలో వాదన సాగించాలంటే నాకు సందేహం కలిగింది. యిలాంటి ప్రమాదకరమైన కేసులో పెద్ద కోర్టులో వాదించడం ప్రమాదమని