పుట:సత్యశోధన.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

321

అధికారులుగా నియమించాడు. సొహరాబ్ చెప్పిన విషయం నేనూ గమనించాను. సొహరాబుకు శాంతంగా వుండమని చెప్పేందుకు ప్రయత్నించాను. కాని సొహరాబ్ అంత తేలికగా అంగీకరించే మనిషికాడు.

మీరు సాధుపుంగవులు. తియ్యగా మాట్లాడి వీళ్ళు మిమ్ము మోసం చేస్తారు. మీరు తరువాత తేరుకొని “పదండి, సత్యాగ్రహం చేద్దాం అని మమ్మల్ని హైరానా పెడతారు” అని నవ్వుతూ అన్నాడు సొహరాబ్. “నా వెంట వుండి హైరానా తప్ప మరింకొకటి ఎప్పుడైనా మీరు పొందారా మిత్రమా? సత్యాగ్రహి మోసగింపబడటానికేగదా పుట్టింది. వాళ్ళు నన్ను మోసం చేస్తే చేయనీయండి చూద్దాం. ఒకరిని మోసం చేయాలనుకునేవాడే చివరికి మోసంలో పడిపోతాడని ఎన్నో సార్లు మీకు చెప్పాను గదా అని అన్నాను.

సొహరాబ్ పకపక నవ్వుతూ ‘మంచిది అలాగే మోసంలో పడండి. ఏదో ఒకరోజున సత్యాగ్రహంలో మీరు చచ్చిపోతే మా బోంట్లను కూడా వెంట తీసుకెళ్ళండి’ అని అన్నాడు. కీర్తిశేషురాలు మిస్. హోబోహౌస్ నిరాకరణోద్యమాన్ని గురించి వ్రాసిన క్రింది మాటలు నాకు జ్ఞాపకం రాసాగాయి. “సత్యం కోసం మీరు ఒకానొక రోజున ఉరికంబం ఎక్కవలసి వస్తుందనడంలో నాకు సందేహం లేదు. భగవంతుడు మిమ్ము సరియైన మార్గాన తీసుకువెళ్లుగాక. మిమ్ము రక్షించుగాక” సొహరాబ్‌తో నా యీ మాటలు ఆఫీసరు గద్దెక్కిన ఆరంభపు రోజుల్లో జరిగాయి. ఆరంభం, అంతం రెండింటి మధ్య ఎంతో కాలం పట్టలేదు. ఇంతలో నరం వాచి నాకు బాధకలిగింది. 14 రోజుల ఉపవాసానంతరం నా శరీరం పూర్తిగా కోలుకోలేదు. కాని కవాతులో తప్పనిసరిగా పాల్గొనసాగాను. ఇంటినుండి కవాతు చేసే చోటుకు కాలినడకన రెండు మైళ్ళు దూరం వెళుతూ వున్నాను. తత్ఫలితంగా మంచం ఎక్కవలసి వచ్చింది.

ఇట్టి స్థితిలో సైతం నేను ఇతరులతో బాటు క్యాంపుకు వెళ్ళవలసి వచ్చింది. మిగతా వారంతా అక్కడ వుండేవారు. నేను సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేవాణ్ణి. ఇక్కడే సత్యాగ్రహానికి బీజారోపణం జరిగిందన్నమాట. ఆఫీసరు తన దర్జా చూపించ సాగాడు. తను అన్ని విషయాల్లోను మాకు ఆఫీసరు అన్నట్లు వ్యవహరించసాగాడు. ఆఫీసరు అట్టి పాఠాలు రెండు మూడు నాకు నేర్పాడు కూడా. సొహరాబ్ నా దగ్గరకు వచ్చాడు. నవాబ్‌గిరీ సహించే స్థితిలో లేడు. “ఏ ఆజ్ఞ అయినా మీ ద్వారానే రావాలి. ఇప్పుడు ఇంకా మనం శిక్షణా శిబిరంలోనే వున్నాం. ప్రతి విషయంలో అర్ధంలేని హుకుములు జారీ అవుతున్నాయి. ఆ యువకులకు మనకు