పుట:సత్యశోధన.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

320

చిన్న సత్యాగ్రహం

ఈ విషయాన్ని పోలక్ తంతి చేరకపూర్వమే నేను యోచించాను. ఆయన తంతి అందిన తరువాత ఆ విషయమై కొంతమంది మిత్రులను సంప్రదించాను. యుద్ధంలో చేరడం ధర్మమని నేను భావించాను. ఈనాడు కూడా ఆ భావానికి కట్టుబడి వున్నాను. అందు దోషం కనబడలేదు. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గురించి ఆనాడు నాకు గల భావాలననుసరించి, వాటిని పాటించే నేను యుద్ధకార్యాలకు సహకరించాను. అలా చేసినందుకు నేను పశ్చాత్తాపపడలేదు.

అయితే నా అభిప్రాయా ఔచిత్యాన్ని ఆనాడుకూడా నా మిత్రుల ఎదుట వుంచి సమర్ధించుకోలేక పోయినమాట నిజం. ఇది కడు సున్నితమైన విషయం. అభిప్రాయ భేదానికి అందుతావున్నది. అందువల్ల అహింసా ధర్మాన్ని అంగీకరించి దానిని పాలించేవారి కోసం శక్త్యానుసారం నా అభిప్రాయాన్ని యిక్కడ వ్యక్తం చేశాను. సత్యనిష్ట గలవారు, నియమాల మీదనే ఆధారపడి పనిచేయకూడదు. తన భావాల్ని మాత్రమే అంటిపెట్టుకొని వుండకూడదు. అందు దోషం వుండవచ్చని అంగీకరించాలి. ఆ దోషాన్ని గురించి పరిజ్ఞానం కలిగినవాడు ఎంత పెద్ద ప్రమాదం సంభవించినా ఎదుర్కొనాలి. దాని ఫలితం అనుభవించాలి. ప్రాయశ్చిత్తం కూడా చేసుకొనేందుకు సిద్ధపడాలి. 

40. చిన్న సత్యాగ్రహం

ధర్మమని భావించి నేను యుద్ధంలో చేరాను. కాని అందుతిన్నగా పాల్గొనే అదృష్టం కలుగలేదు. అలాంటి సున్నితమైన సమయంలో సత్యాగ్రహం చేయవలసి వచ్చింది. మా పేర్లు మంజూరై నమోదు అయిన తరువాత మాకు కవాతు గరపడానికి ఒక అధికారి నియమింపబడిన విషయం పేర్కొన్నాను. యీ ఆఫీసరు యుద్ధ శిక్షణ యివ్వడం వరకే నీమితమై వుంటాడని మిగతా అన్ని విషయాలలో నేను మా ట్రూపుకు నాయకుణ్ణని అంతా అనుకున్నాం. నా అనుచరుల విషయమై బాధ్యత నాదని, నా విషయమై బాధ్యత మావాళ్లదని భావించాను. కాని ఆదిలోనే హంసపాదన్నట్లు ఆ ఆఫీసరుగారి మొదటి చూపులోనే అనుమానం కలిగింది. సొహరాబ్ చాలా తెలివిగలవాడు. నన్ను వెంటనే “అన్నా! జాగ్రత్త. యీ మనిషి మనమీద నవాబ్ గిరీ చలాయించాలని చూస్తున్నట్లుంది. వాడి ఆజ్ఞ మాకు అనవసరం. వాడు కవాతు నేర్పే శిక్షకుడు. అంతే. అరుగో ఆవచ్చిన యువకులు కూడా మనమీద అధికారం చలాయించాలని భావిస్తున్నట్లుంది” అని నన్ను హెచ్చరించాడు. ఆ యువకులు ఆక్సుఫర్డు విద్యార్థులు. శిక్షణకోసం వచ్చారు. పెద్ద ఆఫీసరు వాళ్లను మామీద డిప్యూటీ