పుట:సత్యశోధన.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

318

కర్తవ్యం ఏమిటి?

ఆమెతో మొదటి పర్యాయం పరిచయం ఏర్పడింది. ఆమె బోలెడన్ని బట్టలు నా ఎదుట కుప్పలుగా పడవేసి, వాటిలో సాధ్యమైనన్ని బట్టలు కుట్టించి తనకు అప్పగించమని చెప్పింది. నేను ఆమె కోరికను పాటించి సాధ్యమైనన్ని గుడ్డలు కుట్టించి ఆమెకు అప్పగించాను. 

39. కర్తవ్యం ఏమిటి?

యుద్ధంలో పని చేస్తానని మేము కొంతమందిమి కలిసి ప్రభుత్వానికి పేర్లు పంపించాము. ఈ వార్త అందగానే దక్షిణ ఆఫ్రికా నుండి నాకు రెండు టెలిగ్రాములు అందాయి. ఆందు ఒకటి పోలక్‌ది. “మీరు చేస్తున్న యీ పని మీ అహింసా సిద్ధాంతానికి విరుద్ధంగా లేదా?” అని ఆయన ప్రశ్నించాడు. ఇలాంటి తంతి వస్తుందని నేను మొదటే వూహించాను. అందుకు కారణం వున్నది. యీ విషయాన్ని గురించి నేను “హిందు స్వరాజ్య”లో చర్చించాను. దక్షిణ ఆఫ్రికాలో గల మిత్రులతో యీ విషయమై తరుచు చర్చ జరుగుతూ వుండేది. యుద్ధంలో జరిగే అవినీతి మనందరికీ తెలుసు. నా మీద దౌర్జన్యం చేసిన వారిమీదనే కేసు పెట్టడానికి అంగీకరించని నేను రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతూ వుంటే, అందలి గుణ దోషాల్ని గురించి తెలియనప్పుడు అందు పాల్గొనడం సబబా. యుద్ధంలో నేను పాల్గొన్న విషయం మిత్రులందరికీ తెలిసినప్పటికీ, ఆ తరువాత నా భావాల్లో చాలా మార్పు వచ్చి వుంటుందని వారు అనుకున్నారు. నిజానికి ఏ యోచనా సరళితో నేను బోయర్ యుద్ధంలో పాల్గొన్నానో సరీగా అదే యోచనా సరళితో యీ యుద్ధంలో కూడా పాల్గొనాలని భావించాను. యుద్ధంలో పాల్గొనడానికి, అహింసకు పొంతన కుదరదని తెలుసుకున్నాను. కాని కర్తవ్యబోధ దీపం వెలుగులా స్పష్టంగా వుండదు కదా! సత్య పూజారి అనేక సార్లు మునిగి తేలవలసి వస్తుంది.

అహింస వ్యాపకమైన వస్తువు. హింసావలయంలో చిక్కుకు పోయిన పామర ప్రాణులం మనం. తోటి జీవుల పై ఆధారపడి జీవించాలన్న సూక్తి సరియైనదే. మనిషి బాహ్య హింస చేయకుండా ఒక్క క్షణమైనా జీవించలేడు. లేస్తూ కూర్చుంటూ, తింటూ తిరుగుతూ తెలిసో తెలియకో హింస చేస్తూనే వుంటాడు. అట్టి హింసనుండి బయటపడేందుకు కృషి చేయడం. మనస్సు పూర్తిగా కరుణతో నిండి వుండటం. బహు చిన్న ప్రాణికి సైతం హాని కలిగించకుండా వుండటం అహింసా పూజారి లక్షణం. అట్టి వాని ప్రవృత్తి సంయమం వైపు పయనిస్తుంది. అతనిలో సదా కరుణ నిండి