పుట:సత్యశోధన.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

292

సత్యాగ్రహం పుట్టుక

నేను యరవాడ జైల్లో వున్నప్పుడు వ్రాశాను. ఇదంతా నవజీవన్ పత్రికలో ప్రకటించబడింది. తరువాత అది దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహ చరిత్ర అను పేరిట విడిగా పుస్తకరూపంలో ప్రచురించబడింది. దాని ఆంగ్లానువాదం శ్రీ బాల్‌జీ గోవింద్‌జీ దేసాయి “కరెంట్ థాట్” లో ప్రచురించడం కోసం చేస్తున్నారు. దాన్ని త్వరగా ఇంగ్లీషులో పుస్తక రూపంలో ప్రకటించాలని నేను సూచించాను. దక్షిణ ఆఫ్రికాలో నేను చేసిన పెద్ద ప్రయోగాలను గురించి తెలుసుకోదలచిన వారికి అది అందాలని నా ఉద్దేశ్యం.

గుజరాతీ పాఠకులు ఆ పుస్తకం చదివియుండకపోతే తప్పక చదవమని సిఫారసు చేస్తున్నాను. ఆ చరిత్రలో పేర్కొనబడ్డ ప్రధాన కధా భాగాన్ని వదిలి దక్షిణ ఆఫ్రికాలో నేను చేసిన మిగతా చిన్న పెద్ద నా వ్యక్తిగత ప్రయోగాలను గురించి వచ్చే ప్రకరణాల్లో వ్రాస్తాను. అవి పూర్తికాగానే హిందూ దేశంలో చేసిన ప్రయోగాలను తెలియజేయాలని భావిస్తున్నాను. అందువల్ల ప్రయోగాల సందర్భక్రమాన్ని సరిగా ఉంచుకోవాలని భావించేవారు. దక్షిణ ఆఫ్రికా చరిత్రకు సంబంధించిన ప్రకరణాలను ఎదురుగా ఉంచుకోవడం అవసరం.

27. ఆహారంలో వివిధ ప్రయోగాలు

మనోవాక్కాయాల ద్వారా బ్రహ్మచర్యవ్రతం ఎలా సాగించాలి అనేది ఒక యోచన అయితే సత్యాగ్రహ సమరానికి ఎక్కువ సమయం ఎలా మిగలాలి, హృదయ శుద్ధి అధికంగా ఎలా జరగాలి అనునది మరో యోచన. ఈ రెండు చింతలు లేక యోచనలు నన్ను ఆహారంలో ఎక్కువ మార్పులు చేయమని సంయమానికి అవి అవసరమని ప్రోత్సహించాయి. మొదట నేను ఆరోగ్యదృష్ట్యా ఆహారంలో మార్పులు చేసేవాణ్ణి. ఇప్పుడు ధార్మిక దృష్టితో చేయడం ప్రారంభించాను.

ఈసారి మార్పుల్లో ఉపవాసాలు, అల్పాహారాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. రుచులు మరిగిన జిహ్వ వాంఛల్ని రెచ్చగొడుతుంది. నాస్థితి కూడా అంతే. జననేంద్రియం మరియు స్వాదేంద్రియం మీద అధికారం సంపాదించుటకు నేను నానా అవస్థ పడవలసి వచ్చింది. ఈనాటికీ ఆ రెండిటిని పూర్తిగా జయించానని చెప్పలేను. నేను మొదటి నుండి అధికాహారిని. మిత్రులు నీవు సంయమంగా వున్నావని అనేవారు. దాన్ని నేను సంయమమని భావించలేదు. నామీద విధించుకున్న ఆ కొద్దిపాటి అంకుశాన్ని సడలనిచ్చి ఉంటే పశువుకంటే హీనంగా మారిపోయి వుండేవాణ్ణి. నష్టపడిపోయేవాణ్ణి. నా బలహీనతలు బాగా తెలుసుకున్నందువల్ల వాటి విషయమై