పుట:సత్యశోధన.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

291

సంబంధించిన కొద్ది చరిత్ర వచ్చే ప్రకరణంలో వివరిస్తాను. ప్రస్తుత ప్రకరణం ముగింపునందు వ్రతపాలన తేలికేనని అనిపించింది. వ్రతం ప్రారంభించగానే కొన్ని మార్పులు చేశాను. భార్యతో బాటు ఒకే పక్క మీద శయనించడం, ఆమెను ఒంటరిగా కలుసుకోవడం మానివేశాను. ఈ విధంగా ఏ బ్రహ్మచర్య వ్రతాన్ని ఇష్టంగానో, అయిష్టంగానో 1900 నుండి ప్రారంభించానో ఆ వ్రతారంభం నిజానికి 1906 మధ్య కాలంలో జరిగిందని చెప్పవచ్చు.

26. సత్యాగ్రహం పుట్టుక

జోహన్సుబర్గులో ఏదో ఒక ఘట్టం నా కోసం జరుగుతూ ఉంటున్నదని అనిపించసాగింది. ఆత్మశుద్ధి కోసం నేను చేసిందంతా సత్యాగ్రహానికి ముందు జరిగిన ఏర్పాటు అనిపించింది. బ్రహ్మచర్య వ్రతానికి పూనుకొనేవరకు నా జీవనంలో జరిగిన ముఖ్య ఘట్టాలన్నీ అప్రత్యక్షరూపంలో నన్ను సత్యాగ్రహానికి సిద్ధం చేస్తాయనని ఇప్పుడు నాకు తోస్తున్నది. ‘సత్యాగ్రహం’ అను శబ్ద ఆవిర్భావానికి ముందే ఆ వస్తువు పుట్టుక జరిగిందన్నమాట. ఆ సమయంలో అది ఏమిటో నాకు తెలియదు. కాని పాసివ్‌రెజిస్టెన్స్ అను ఆంగ్లశబ్దం ద్వారా దాన్ని తెలుసుకోసాగాను. ఇంగ్లీషువాళ్ళ ఒక సభలో ఈ శబ్దానికి వాళ్ళు తీసుకుంటున్న సంకుచిత అర్థం ఏమిటో గ్రహించాను. అది బలహీనుల ఆయుధం అని వారు భావించారు. అందు ద్వేషానికి అవకాశం ఉన్నది. దాని చివరి అంశం హింసారూపంలో బహిర్గతం కావచ్చు. ఈ విధమైన వారి భావాన్ని నేను ఖండించవలసి వచ్చింది. హిందూ దేశస్థుల సంగ్రామం యొక్క యదార్థ స్వరూపాన్ని వారికి తెలియజేయవలసి వచ్చింది. హిందూ దేశస్థులికి ఈ సంగ్రామ స్వరూపం బోధపరిచేందుకు క్రొత్త శబ్దాన్ని సృష్టించవలసి వచ్చింది.

అందుకు తగిన మంచి శబ్దం స్ఫురణకు రాలేదు. తగిన శబ్దం కోసం బహుమతి నిర్ణయించి ఇండియన్ ఒపీనియన్ పత్రికలో ప్రకటించి పాఠకులకు పోటీ పెట్టాము. ఈ పోటీ ఫలితంగా మగన్‌లాల్ గాంధీ సత్ - ఆగ్రహం రెండింటికీ సంధి కలిపి ‘సదాగ్రహం’ అను శబ్దం వ్రాసి పంపాడు. బహుమతి అతనికి లభించింది. కాని సదాగ్రహం అను శబ్దం ఇంకా స్పష్టంగా లేదని భావించి నేను సత్యాగ్రహం అని మార్చాను. గుజరాతీలో ఇది పోరు అను అర్థంలో ప్రచలితం అయింది.

ఈ సంగ్రామ చరిత్రయే దక్షిణ ఆఫ్రికాలో సాగిన నా జీవనంలో నేను కావించిన సత్యశోధన లేక సత్య ప్రయోగాల చరిత్ర అని చెప్పవచ్చు. ఈ చరిత్ర (ఎక్కువ భాగం)