పుట:సత్యశోధన.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

288

హృదయ మధనం

వారికి నన్ను పరిచయం చేశారు. వీరంతా వృత్తిరీత్యా స్పార్క్సు. ఒక కసాయివాడకు యజమాని. కర్నల్ మెకంజీ నేటాలుకు చెందిన ప్రసిద్ధ రైతు. వారంతా వాలంటీర్లు. వాలంటీర్ల రూపంలో సైనిక శిక్షణ పొంది అనుభవం సంపాదించారు. మేము సేవ చేస్తున్న జూలూ క్షతగాత్రులంతా యుద్ధంలో గాయపడ్డ వారని పాఠకులు భావించవద్దు. వారిలో చాలామంది సందేహించి నిర్భందించబడ్డ ఖైదీలు. వారిని కొరడాతో కొట్టమని జనరల్ ఆదేశించాడు. కొరడా దెబ్బలు తగిలిన చోట బాగా కమిలిపోయింది. మరి కొంతమంది మిత్రులుగా భావించబడ్డ జూలూ జాతివాళ్ళు. ఈ మిత్రులు స్నేహాన్ని సూచించే గుర్తులు ధరించి ఉన్నారు. అయినా సైనికులు పొరపాటున వాళ్ళను కూడా గాయపరిచారు.

తెల్ల సిపాయిలకు కూడా మందులిచ్చే పని నాకు అప్పగించారు. డాక్టర్ బూథ్‌గారి చిన్న ఆసుపత్రిలో నేను ఒక సంవత్సరంపాటు ఈ పని నేర్చుకున్నాను. ఇది నాకు బహు తేలిక పని. ఈ పనివల్ల నాకు చాలా మంది ఆంగ్ల సైనికులతో మంచి పరిచయం ఏర్పడింది. యుద్ధంలో పాల్గొంటున్న సైన్యం ఒకే చోట ఉండదు. సంకటం ఏర్పడిందన్న చోటుకు పరిగెత్తాలి. వారిలో చాలామంది గుర్రపు రౌతులు. మా దళం ప్రధాన స్థావరాలనుండి తప్పుకొని వాళ్ళ వెంట వెళ్ళవలసి వచ్చింది. మా సరంజామా మేమే మోసుకెళ్ళాలి. ఒక్కొక్కసారి పగటిపూట 40 మైళ్ళ దూరం కాలి నడకన పయనం సాగించవలసి వచ్చేది. ఇక్కడ కూడా మాకు భగవంతుని కార్యమే లభించింది. పొరపాటువల్ల గాయపడ్డ జూలూలను కూడా డోలీలలో ఎత్తుకొని ఆసుపత్రికి చేర్చి అక్కడ వారికి సేవ శుశ్రూష చేయాలి. ఇదీ మా కార్యక్రమం.

25. హృదయ మథనం

జూలూ తిరుగుబాటు సమయంలో నాకు అనేక అనుభవాలు కలిగాయి. ఆలోచించడానికి చాలా సామగ్రి లభించింది. బోయరు యుద్ధంలో కనబడిన భయంకర రూపం ఇక్కడ కనబడలేదు. ఇక్కడ జరుగుతున్నది యుద్ధం కాదు. మనుష్యుల వేట జరుగుతున్నదన్నమాట. నాతో మాట్లాడిన చాలామంది ఆంగ్లేయుల అభిప్రాయం కూడా ఇదే. ప్రొద్దున్నే సైనికులు లేవడం, వెంటనే గ్రామాలకు వెళ్ళడం, టపాకాయలు పేల్చినట్లు తుపాకులు పేల్చడం, ఆ ధ్వనులు దూరాన వున్న మాకు వినబడటం ఇదీ వరస. నేను ఈ వ్యవహారం సహించలేకపోయాను. అయినా చేదు గుటకలు మ్రింగవలసి వచ్చింది. నాకు లభించిన పని క్షతగాత్రులైన జూలూలకు సేవ