పుట:సత్యశోధన.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

263

అక్కడ నివాసం వున్నవారు భూమిమీద హక్కు కలిగి వున్నారు. అందువల్ల వాళ్ళకు నష్టపరిహారంగా ఏదో కొంత లభించాలి. పరిహారంగా ఎంతసొమ్ము చెల్లించాలో నిర్ణయించేందుకు కోర్టు ఏర్పాటు అయింది. మునిసిపాలిటీ వాళ్ళు యిస్తానన్న సొమ్ము తీసుకోకపోతే కేసు ఆ కోర్టు ముందుకు వెళుతుంది. ఆ కోర్టువారు ఎంత నిర్దారిస్తే అంత కూలీలు తీసుకోవాలి. యిదీ విధానం. మునిసిపాలిటీ వారిచ్చే దానికంటే ఎక్కువ సష్టపరిహారం కోర్టు నిర్ణయిస్తే వకీలుకు అయిన ఖర్చు మునిసిపాలిటీ వారే భరిస్తారు.

ఈ వ్యవహారంలో ఎక్కువ మంది కూలీలు తమ తమ తరుపున నన్ను వకీలుగా నియమించారు. డబ్బు చేసుకుందామనే కోరిక నాకు లేదు. “మీరు గెలిస్తే మునిసిపాలిటీ వాళ్ళు యిచ్చే సొమ్ముతో తృప్తిపడతా, మీరు గెలిచినా, ఓడినా పట్టాకు 10 పౌండ్లు చొప్పున యివ్వండి చాలు.” అని వారికి చెప్పాను. అంతేగాక ఆవిధంగా వచ్చిన సొమ్ములో సగభాగం బీదవారి కోసం ఆసుపత్రి నిర్మాణానికో లేక అలాంటిదే మరో ప్రజాసేవా కార్యానికో వినియోగిస్తానని కూడా వారికి చెప్పాను. నామాటలు విని వాళ్ళు సంతోషించారు. సుమారు 70 దావాలు జరిగాయి. నాకు ఒక్క దానిలో మాత్రం పరాజయం కలిగింది. అందువల్ల పెద్ద మొత్తం నాకు లభించింది. ఇండియన్ ఒపీనియన్ పత్రికా ఖర్చు భారం నా మీద బాగా పడటం వల్ల ఆ మొత్తంలో 1600 పౌండ్ల సొమ్ము ఆ ఖాతాకు వెళ్ళి పోయిందని గుర్తు.

ఈ దావాలకై నేను చాలా కృషిచేశాను. కక్షిదారులు గుంపులు గుంపులుగా నా దగ్గర వుండేవారు. వారిలో చాలామంది ఉత్తర బీహారుకు, దక్షిణాదికి చెందిన తమిళ, తెలుగు ప్రాంతాలనుండి గిరిమిట్లుగా వచ్చిన భారతీయులు. ఆ తరువాత వారంతా గిరిమిట్ ప్రధ నుండి విముక్తి పొంది స్వతంత్రంగా వృత్తి చేసుకోసాగారు.

వీళ్ళంతా కలిసి తమ కష్టాలు తొలగించుకొనేందుకు భారతీయ వ్యాపారస్థులకు సంబంధించిన మండలి నుండి విడివడి మరో మండలిని సొంతంగా స్థాపించుకున్నారు. నిర్మలహృదయులు, నిజాయితీపరులు, శీలవంతులు అయిన ఆ మండలి అధ్యక్షుని పేరు శ్రీ జయరాం సింహ్. అధ్యక్షుడు కాకపోయినా అధ్యక్షుని వంటి మరొకరి పేరు శ్రీ బద్రీ. ఇద్దరూ ఇప్పుడు కీర్తిశేషులే. వారిద్దరి వల్ల నాకు ఎంతో సహకారం లభించింది. శ్రీ బద్రీతో చాలా పని నాకు పడింది. ఆయన సత్యాగ్రహంలో ప్రముఖంగా పాల్గొన్నాడు. వీరివంటి వారి వల్ల దక్షిణ భారతావనికి, ఉత్తర భారతావనికి చెందిన పలువురితో నాకు దగ్గర సంబంధం ఏర్పడింది. నేను వారి వకీలునేగాక ఒక సోదరునిగా పున్నాను. వారి దుఃఖాలలో భాగస్వామిగా వున్నాను. ‘సేఠ్ అబ్దుల్లా నన్ను గాంధీ అని పిలవడానికి అంగీకరించలేదు. నన్ను దొర అని అక్కడ ఎవరు అంటారు?