పుట:సత్యశోధన.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

261

నా యీ యోచనా సరళి సరియైనదైతే ప్రపంచంలో నడుస్తున్న ఈనాటి పత్రికల్లో ఎన్ని నిలుస్తాయి? అయితే పనికిమాలిన వాటిని ఆపగల వారెవ్వరు? ఏవి పనికిమాలినవో ఎలా తేల్చడం? పనికివచ్చేవి, పనికిరానివీ రెండు ప్రక్క ప్రక్కన నడుస్తూనే ఉంటాయి. అయితే మనిషి వాటిలో తనకు ఏది గ్రాహ్యమో ఏది అగ్రాహ్యమో నిర్ణయించుకోవాలి.

14. కూలి లొకేషనా లేక పాకీవాళ్ళ పల్లెయా?

హిందూ దేశంలో మనకి అపరిమితంగా సేవ చేసే పాకీ మొదలుగాగల వారిని అసభ్యులుగా భావించి వాళ్ళను ఊరి బయట విడిగా వుంచుతాము. గుజరాతీ భాషలో వారి పల్లెను ఢేడ్‌వాడ అని అంటారు. ఈ పేరును ఉచ్చరించడానికి కూడా జనం అసహ్యించుకొంటారు. యిదేవిధంగా యూరపులో క్రైస్తవ సమాజంలో ఒకానొక కాలంలో యూదులు అస్పృశ్యులుగా భావించబడేవారు. వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడిన ఢేడ్‌వాడాను ఘేటో అని అనేవారు. దుర్గుణాలకు చిహ్నంగా దాన్ని పరిగణించేవారు. దక్షిణ ఆఫ్రికాలో అదే విధంగా హిందూ దేశస్థులమంతా పాకీవారుగా పరిగణింపబడేవారం. ఎండ్రూస్ చేసిన ఆత్మ త్యాగం వల్ల, శాస్త్రిగారి మంత్రదండం వల్ల మాకు శుద్ధి జరుగుతుందో లేదో మేము పాకీవారుగా పరిగణించబడక సభ్యులుగా పరిగణింపబడతామో లేదో ముందు ముందు చూడాలి.

హిందువుల మాదిరిగా యూదులు కూడా తాము దేవునికి ప్రీతిపాత్రుల మని, యితరులంతా ప్రీతిపాత్రులు కారని భావించి ఎన్నో అపరాధాలు చేశారు. అందుకు విచిత్రమైన పద్ధతిలో క్రూరంగా వారికి శిక్ష పడింది. దరిదాపు అదే విధంగా హిందువులు కూడా తాము సభ్యులమని, సుసంస్కృతులమని లేక ఆర్యులమని భావించి తమకు సంబంధించిన అవయవాల వంటివారిని అసభ్యులని అనార్యులని పాకీవాళ్ళని భావించారు. తాము చేసిన ఆ అపరాధానికి తగిన శిక్ష విచిత్రమైన పద్ధతిన క్రూరంగా దక్షిణ ఆఫ్రికా వంటి అధినివేశ దేశాలలో అనుభవిస్తున్నారు. ఈ శిక్షను హిందువుల ఇరుగుపొరుగున ఉండే మహ్మదీయులు, పారశీకులు కూడా అనుభవిస్తున్నారని నా అభిప్రాయం.

జోహన్సుబర్గులో కూలీల లొకేషనుకు యీ ప్రకరణంలో ప్రాధాన్యం ఎందుకిస్తున్నానో పాఠకులకు బోధపడి వుంటుంది. దక్షిణ ఆఫ్రికాలో మా అందరికి