పుట:సత్యశోధన.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

246

ఒక జాగరూకత

ఈనాటివరకు నేను తెలుసుకోలేకపోయాను. ఆ పుస్తకం ఇండియన్ ఒపీనియన్ పత్రిక కోసం వ్రాయబడింది. అయితే దాన్ని ఆధారంగా తీసుకుని చాలామంది సోదర సోదరీమణులు తమ జీవనంలో ఎన్నో మార్పులు చేసుకున్నారు. నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరిపారు.

అందువల్ల ఆ విషయాన్ని గురించి ఇక్కడ కొద్దిగా వ్రాయవలసిన అవసరం ఏర్పడింది. ఆ పుస్తకంలో వ్రాసిన నా భావాలలో మార్పు చేయవలసిన అవసరం ఏమీ కలుగకపోయినా, నేను జీవితంలో చేసిన అత్యవసరమైన కొన్ని మార్పుల్ని గురించి ఆ పుస్తకం చదివిన పాఠకులకు తెలియదు. వారు ఆ వివరం తెలుసుకోవడం చాలా అవసరం.

మిగతా పుస్తకాలవలెనే నేను ఈ పుస్తకం కూడా కేవలం ధార్మిక భావంతో వ్రాశాను. ఇప్పటికీ నేను చేసే ప్రతి పనిలో ఆ భావమే నిండి ఉంటుంది. అందువల్ల అందలి అనేక విషయాల్ని నేను అమలు చేయలేకపోయాను. ఇది నాకు విచారం, సిగ్గు కలిగించే విషయం.

బాల్యంలో బిడ్డ తల్లి పాలు త్రాగుతాడు. ఆ తరువాత మరో పాలు త్రాగవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. పండిన వన్య ఫలాలతో బాటు ఆకుపచ్చని పండ్లు, ఎండు ఫలాలు మనిషికి మంచి ఆహారం. వాటికి మించినది మరొకటి లేదు. బాదంపప్పు, ద్రాక్ష మొదలుగాగలపండ్ల వల్ల మనిషి శరీరానికి, మెదడుకు అవసరమైన పోషణ లభిస్తుంది. ఇట్టి ఆహారం మీద ఆధారపడి వుండగల వారు బ్రహ్మచర్యం మొదలగు ఆత్మ సంయమగుణాల్ని అలవరచుకోవచ్చు. తిండిని బట్టి త్రేపులు ఉంటాయి. తినే తిండిని బట్టి మనిషి తయారవుతాడు. అను సామెత యందు సత్యం ఇమిడి ఉంది. నేను, నా అనుచరులు అట్టి అనుభవం పొందాం.

ఈ భావాలను సమర్థిస్తూ విస్తారంగా నా ఆ పుస్తకంలో వ్రాయడం జరిగింది. కాని హిందూదేశంలో నా ప్రయోగాలు పూర్తి సాఫల్యం పొందే అదృష్టం నాకు కలగలేదు. ఖేడా జిల్లాలో సైనికుల్ని భర్తీ చేసుకుంటూ నా పొరపాటు వల్ల మృత్యుశయ్య మీదకు చేరాను. పాలు లేకుండా జీవించాలని ఎంతో ప్రయాసపడ్డాను. తెలిసిన వైద్యుల, డాక్టర్ల, రసాయన శాస్త్రజ్ఞుల సహాయం కోరాను. పెసరనీళ్ళు తీసుకోమని ఒకరు, విప్పనూనె తీసుకోమని ఒకరు, బాదంపాలు తీసుకోమని ఒకరు సలహా ఇచ్చారు. వాటినన్నింటి ప్రయోగాలు చేసి చేసే నా శరీరాన్ని పిండివేశాను. తత్ఫలితంగా