పుట:సత్యశోధన.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

241

దుఃఖానికి కారణం నా యెడ వారికి గల ప్రేమయే. నా సొమ్ముకంటే నా సదాచరణ వారికి ముఖ్యం. చివరి రోజుల్లో అన్నగారు కరిగిపోయి తాను మృత్యుశయ్యమీద వున్నప్పడు “నీ ఆచరణయే సరియైనది, ధర్మబద్ధమైనది అని నాకు తెలియజేశారు. కరుణరసంతో నిండిన వారి జాబు నాకు అందింది. తండ్రి కుమారుని క్షమాపణ కోరగలిగితే వారు నన్ను క్షమాభిక్ష కోరినట్లే. నా బిడ్డలను నీ విధానంలోనే పెంచి పోషించమని వ్రాశారు. నన్ను కలుసుకోవాలని ఆతురతను వ్యక్తం చేశారు. నాకు తంతి పంపారు. వెంటనే తంతి ద్వారా నా దగ్గరకు రమ్మని వారికి తెలియజేశాను. కాని మా ఇరువురి కలయిక సాధ్యపడలేదు. వారి బిడ్డలకు సంబంధించిన వారి కోరిక కూడా నెరవేరలేదు. అన్నగారు భారతదేశంలోనే శరీరం త్యజించారు. వారి పిల్లలపై తండ్రి యొక్క పాత జీవన ప్రభావం బాగా పడింది. వాళ్ళు మారలేకపోయారు. నేను వారిని నా దగ్గరకు తెచ్చుకోలేకపోయాను. ఇందు వారి దోషం ఏమీ లేదు. స్వభావాన్ని ఎవరు మార్చగలరు? బలమైన సంస్కారాల్ని ఎవరు పోగొట్టగలరు? మనలో మార్పు వచ్చిన విధంగా మన ఆశ్రితుల్లో, బంధువుల్లో, కుటుంబీకుల్లో మార్పు రావాలని భావించడం వ్యర్థమే”

ఈ దృష్టాంతం వల్ల తల్లిదండ్రుల బాధ్యత ఎంత భయంకరమైనదో అంచనా వేయవచ్చు.

6. మాంసరహిత ఆహారం కోసం బలిదానం

జీవితంలో త్యాగనిరతి, నిరాడంబరత, ధర్మ జాగృతితో బాటు మాంసరహిత ఆహారాన్ని గురించి. అట్టి ఆహార ప్రచారాన్ని గురించి శ్రద్ధ పెరగసాగింది. ఆచరణ ద్వారాను, జిజ్ఞాసువులతో చర్చల ద్వారాను ప్రచారం చేయడం ప్రారంభించాను.

జోహన్సుబర్గులో ఒక మాంసరహిత భోజనశాల వున్నది. కూనేగారి జల చికిత్స తెలిసిన ఒక జర్మనీ వాడు దాన్ని నడుపుతూ ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళడం ప్రారంభించాను. వెంట తీసుకొని వెళ్ళగలిగినంత మంది ఇంగ్లీషు వాళ్ళను అక్కడికి తీసుకువెళ్ళసాగాను. ఈ భోజనశాల ఎక్కువ రోజులు నడవదని గ్రహించాను. ఎప్పుడూ డబ్బుకు ఇబ్బందే. అవసరమని భావించి చేతనైనంత ఆర్థిక సాయం చేశాను. కొంత డబ్బు పోగొట్టుకున్నాను కూడా. చివరికి ఆ భోజనశాల మూతబడింది. థియాసాఫిస్టుల్లో ఎక్కువ మంది శాకాహారులు. కొందరు పూర్తిగా, కొందరు సగం శాకాహారులు. ఆ మండలిలో సాహసోపేతురాలైన ఒక మహిళ వుంది. ఆమెది పెద్ద