పుట:సత్యశోధన.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

240

నిరీక్షణకు ఫలితం

వ్యతిరేకించేవారు, భూతకాలపు అనుచరులు మొదలగువారు ఎక్కువ ఉపకారాలు చేసిన సజ్జనులు వీరి మధ్య భేదం చూపవద్దు అని అంటే ఏమిటి? అది ఎలా సాధ్యం? అపరిగ్రహాన్ని పాలించడం ఎలా? దేహం వున్నదిగదా! ఇది తక్కువ పరిగ్రహమా? భార్యాబిడ్డలు పరిగ్రహాలు కాదా? గ్రంధాలతో నిండియున్న అల్మారాలను తగులబెట్టనా! ఇల్లు తగులబెట్టి తీర్ధాలకు వెళ్ళనా? ఇల్లు తగులబెట్టందే తీర్థాలు సాధ్యం కావు అని వెంటనే సమాధానం వచ్చింది. ఇక్కడ ఇంగ్లీషు చట్టం సహాయం చేసింది. ప్రెల్ యొక్క చట్టపరమైన సిద్ధాంతాల వివరం జ్ఞాపకం వచ్చింది. ట్రస్టీ అను శబ్దానికి అర్థం ఏమిటో గీత చదివిన తరువాత బాగా బోధపడింది. లా శాస్త్రం ఎడ ఆదరణ పెరిగింది. దానిలో కూడా నాకు ధర్మదర్శనం లభించింది. ట్రస్టీ దగ్గర కోట్లాది రూపాయలు వున్నా వాటిలో ఒక్క దమ్మిడీ కూడా అతనిది కాదు. ముముక్షువు యొక్క స్థితి కూడా ఇంతేనని గీతాధ్యయనం వల్ల నాకు బోధపడింది. అపరిగ్రహికావడానికి, సమభావి కావడానికి హేతువుయొక్క మార్పు, హృదయము యొక్క మార్పు అవసరమను విషయం గీతాధ్యయనం వల్ల దీపపు కాంతిలా నాకు స్పష్టంగా కనబడింది. భీమా పాలసీ ఆపివేయమనీ, ఏమైనా తిరిగి వచ్చేది వుంటే తీసుకోమనీ, తిరిగి వచ్చేది ఏమీ లేకపోతే ఆ సొమ్ము పోయినట్లుగా భావించమనీ, భార్యా బిడ్డల సంరక్షణ వాళ్ళను, నన్ను పుట్టించినవాడే చేస్తాడనీ, దేవాశంకరభాయికి జాబు వ్రాశాను. ఈనాటి వరకు నా దగ్గర మిగిలిన సొమ్మంతా మీకు అర్పించాను. ఇక నా ఆశమానుకోండి ఇకనుండి నా దగ్గర మిగిలేదంతా జాతికి ఉపయోగపడుతుంది అని పితృతుల్యులగు నా అన్నగారికి వ్రాశాను.

అయితే ఈ విషయం అన్నగారికి వెంటనే వివరించలేకపోయాను. మొదట వారు కఠినమైన భాషలో తన విషయమై నా కర్తవ్యం ఏమిటో వివరించి నీవు మన తండ్రిగారిని మించి తెలివితేటలు ప్రదర్శించవద్దు. మన తండ్రి ఎలా కుటుంబపోషణ చేశారో నీవు కూడా అదే విధంగా కుటుంబపోషణ చేయాలి అంటూ ఏమేమో వ్రాశారు. వినమ్రంగా సమాధానం వ్రాస్తూ “తండ్రిగారు చేసిన పనే నేను చేస్తున్నాను. కుటుంబం యొక్క అర్థాన్ని విస్తృతం చేసి చూచుకుంటే నా నిర్ణయమందలి ఔచిత్యం మీకు బోధపడుతుంది” అని తెలియజేశాను.

అన్నగారు ఇక నా ఆశవదులుకున్నారు. మాట్లాడటం కూడా విరమించుకున్నారు. నాకు దుఃఖం కలిగింది. కాని ధర్మమని భావించిన విషయాన్ని వదలమంటే మరీ దుఃఖం కలిగింది. నేను పెద్ద దుఃఖాన్ని సహించాలని నిర్ణయించుకున్నాను. అయినా