పుట:సత్యశోధన.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

236

నాలో పెరిగిన త్యాగ ప్రవృత్తి

తరువాత ఇలా అన్నాను. “నిజానికి నన్ను మీరు ఏ పని కోసం పిలిపించారో, ఆ పని అయిపోయిందని భావించవచ్చు. కాని మీరు వెళ్ళమన్నా వెళ్ళకూడదని, సాధ్యమైనంతకాలం ట్రాన్సువాలులో వుండాలని భావిస్తున్నాను. నా పని నేటాలులో కాక, ఇక్కడ జరగాలని భావిస్తున్నాను. ఒక్క సంవత్సరంలో తిరిగి వెళ్ళిపోదామనే అభిప్రాయం నేను విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వకీలు వృత్తి ప్రారంభిస్తాను. అనుమతి తీసుకుంటాను. ఈ క్రొత్త విభాగాన్ని నడిపించగల శక్తి నాకు వున్నది. ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోకపోతే జాతి దెబ్బ తింటుంది. ఇక్కడి నుండి అంతా మూట ముల్లె కట్టుకొని పారిపోవలసిన స్థితి దాపురిస్తుంది. మి. చేంబర్లేను నన్ను కలవలేదు. ఆ అధికారి నా విషయంలో తుచ్ఛంగా వ్యవహరించాడు. అయితే జాతి మొత్తానికి జరుగుతున్న అవమానం ముందు ఇది అంత పెద్దది కాదు. కుక్కలవలె మనం ఇక్కడ వుండటం సహించరాని విషయం.” అంటూ యదార్థ విషయాన్ని వాళ్ళందరి ముందు వుంచాను. ప్రిటోరియూ మరియు జోహన్సుబర్గులో నివసిస్తున్న హిందు దేశనాయకులతో చర్చించాను. చివరికి జోహన్సుబర్గులో ఆఫీసు నెలకొల్పాలని నిర్ణయించాము.

ట్రాన్సువాలులో నాకు వకీలు వృత్తికి అనుమతి పత్రం లభించే విషయం సందేహాస్పదమే. అయితే వకీళ్ల సముదాయం మాత్రం నన్ను వ్యతిరేకించలేదు. పెద్ద కోర్టు వారు వకీలు వృత్తి కోసం నేను పెట్టుకొన్న దరఖాస్తును అంగీకరించారు.

హిందూ దేశవాసులకు తగినచోట ఆఫీసు నెలకొల్పడం కోసం ఇల్లు దొరకడం కూడా అక్కడ కష్టమే. మి. రీచ్‌గారితో నాకు బాగా పరిచయం ఉంది. అప్పుడు వారు వ్యాపారవర్గంలో వున్నారు. వారికి పరిచితుడైన హౌస్ ఏజంటు ద్వారా ఆఫీసు కోసం నాకు మంచి చోట ఇల్లు దొరికింది. నేను వకీలు వృత్తి ప్రారంభించాను.

4. నాలో పెరిగిన త్యాగ ప్రవృత్తి

ట్రాన్సువాలులో హిందూ దేశవాసుల హక్కులకోసం ఏ విధంగా పోరు సలపవలసివచ్చిందో, ఆసియా విభాగానికి చెందిన అధికారులతో ఏవిధంగా తలపడవలసి వచ్చిందో వివరించే ముందు నా జీవితంలో జరుగుతున్న మరో ముఖ్యమైన మార్పును గురించి తెలియజేయడం అవసరమని భావిస్తున్నాను.

ఇప్పటివరకు కొంత డబ్బు ప్రోగు చేయాలనే కోరిక నాకు వున్నది. పారమార్థికంతో బాటు స్వార్థం కూడా అందు చోటు చేసుకున్నది. బొంబాయిలో నా ఆఫీసు