పుట:సత్యశోధన.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

232

ఆసియా నవాబ్ గిరి

నా చిరకాల మిత్రుడగు డర్బన్ పోలీసు సూపరింటెండెంటు దగ్గరకు వెళ్ళాను. “మీరు అధికార పత్రం ఇచ్చే అధికారికి నన్ను పరిచయం చేయండి. నాకు అనుమతి పత్రం ఇప్పించండి. నేను ట్రాన్సువాలులో వున్నానని మీరు ఎరుగుదురు.” అని చెప్పాను. ఆయన వెంటనే నెత్తిన హాట్ పెట్టుకొని నా వెంట బయలుదేరారు. నాకు అనుమతి పత్రం ఇప్పించాడు. నా రైలు బయలుదేరడానికి ఒక గంట టైము మాత్రమే వున్నది. నేను మొదటనే సామాను సిద్ధం చేసి పెట్టుకున్నాను. సూపరింటెండెంట్ అలెగ్జాండరుకు ధన్యవాదాలు చెప్పి ప్రిటోరియాకు బయలుదేరాను. పడవలసిన కష్టాలు నాకు బోధపడ్డాయి. నేను ప్రిటోరియా చేరాను. దరఖాస్తు సిద్ధం చేశాను. డర్బనులో ప్రతినిధుల పేర్లు ఎవరినైనా అడిగారేమో నాకు గుర్తులేదు. ఇక్కడ క్రొత్త విభాగం పనిచేస్తున్నది. వాళ్ళు భారతీయ ప్రతినిధుల పేర్లు ముందుగానే అడిగి తెలుసుకున్నారట. అంటే నన్ను ప్రతినిధి వర్గానికి దూరంగా వుంచడమే దాని అర్థమన్నమాట. ఈ వార్త ప్రిటోరియాలో గల హిందూ దేశస్థులకు తెలిసింది.

ఇది దుఃఖకరమైన కథ. మనో వినోదం కల్పించే కథ కూడా. వివరాలు తరువాత వ్రాస్తాను.

2. ఆసియా నవాబ్ గిరి

అసలు నేను ట్రాన్సువాలులో అడుగు ఎలా పెట్టగలిగానో క్రొత్త విభాగం అధికారులు తెలుసుకోలేకపోయారు. తమ దగ్గరకు వచ్చిన హిందూ దేశస్థుల్ని ఈ విషయం అడిగారు. కాని పాపం వాళ్ళకు ఏం తెలుసు? నాకు గతంలో గల పరిచయాల వల్ల అధికార పత్రం లేకుండా ట్రాన్సువాలులో ప్రవేశించి వుంటానని భావించారు. అప్పుడు నన్ను అరెస్టు చేయవచ్చునని అనుకున్నారు.

యుద్ధం ముగిసిన తరువాత పెద్ద పెద్ద అధికారులకు ప్రత్యేక అధికారాలు అన్నిచోట్ల ఇవ్వబడతాయి. దక్షిణాఫ్రికాలో కూడా అలాగే జరిగింది. అక్కడ శాంతి పరిరక్షణ పేరిట ఒక ప్రత్యేక చట్టం చేయబడింది. ఆ చట్టమందలి ఒక నిబంధన ప్రకారం అనుమతి పత్రం లేకుండా ట్రాన్సువాలులో ప్రవేశించే వారిని అరెస్టు చేయవచ్చు. జైల్లో పెట్టవచ్చు. ఈ నిబంధన ప్రకారం నన్ను అరెస్టు చేయాలని అధికారులు చెవులు కొరుక్కోవడం ప్రారంభించారు. అయితే నన్ను అనుమతి పత్రం చూపించమని అడిగేందుకు ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. అధికారుల డర్బనుకు తంతి పంపారు. అనుమతి పత్రం తీసుకొనే వచ్చానని అక్కడి వాళ్ళు చెప్పేసరికి వాళ్ళ కాళ్ళు