పుట:సత్యశోధన.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

219

చేస్తున్నప్పటికి మైలు బండ్లు ఎక్కలేదు. వాటిలో జనం క్రిక్కిరిసి వుండటం గమనించాను. మిగతా రైళ్ళ కంటే మైలుబండ్లలో మూడవ తరగతి చార్జీకూడా ఎక్కువే. నాకది కష్టమనిపించింది,

మూడోతరగతి పెట్టెలో చెత్త చెదారం, మరుగుదొడ్ల కంపు ఇప్పుడెట్లా వున్నాయో అప్పుడు కూడా అట్లాగే వున్నాయి. కొద్దిగా మార్పులు జరిగితే జరిగియుండవచ్చు. మూడో తరగతికి, మొదటి తరగతికి చార్జీల్లో తేడావుండటమే గాక సౌకర్యాల్లో కూడా తేడా వుంది. మూడో తరగతి ప్రయాణీకులకి, గొర్రెలకి తేడా ఏమీ లేదు. ఇక్కడి బండ్లు కూడా గొర్రెలకు అనుకూలమైనవని చెప్పవచ్చును.

యూరపులో మూడోతరగతిలో ప్రయాణం చేయటమే నాకు అలవాటు. ఎట్లా వుంటాయో చూద్దామని ఒకసారి మొదటి తరగతి పెట్టె ఎక్కాను. మూడోతరగతికి మొదటి తరగతికి పెద్ద తేడా నాకు కనబడలేదు. దక్షిణ ఆఫ్రికాలో మూడో తరగతి ప్రయాణీకులంటే నీగ్రోలన్న మాట. కొన్ని పెట్టెల్లో మూడోతరగతి ప్రయాణీకులకు సౌకర్యాలు వుంటాయి. కొన్ని బండ్లలో మూడో తరగతి ప్రయాణీకులకు పడుకొనేందుకు ఏర్పాట్లు వుంటాయి. కూర్చునే చోట దిండ్లు వుంటాయి. పెట్టెల్లో సీట్లను మించి జనం ఎక్కరు. మనదేశంలో అసలే రైల్వేవారిలోట్లు ఎక్కువ. వాటితో బాటు యిటు ప్రయాణీకులు కూడా చాలా అపరిశుభ్రంగా వుంటారు. వాళ్ళ ప్రక్కన కూర్చొని ప్రయాణించడం శుచిగా వుండేవారికి చాలా కష్టం. అట్టి ప్రయాణం వాళ్లకు శిక్షయే. చాలామంది పెట్టెలోనే ఉమ్మి వేస్తూ వుంటారు. మురికి చేస్తూ వుంటారు, బీడీల పొగ సరేసరి. తమలపాకులు, పొగాకు నమిలి పిచికారీ చేస్తూ వుంటారు. బిగ్గరగా మాట్లాడుతూ వుంటారు. ప్రక్క వారికి యిబ్బందిని లెక్కచేయకుండా దుర్భాషలాడుతూ వుంటారు. ఈ విధమైన మూడోతరగతి పెట్టెల్లో ప్రయాణం చేసి చాలాసార్లు పైన తెలిపిన యాతనలన్నింటిని అనుభవించాను.

నేను 1920 లో మూడో తరగతి పెట్టెలో ప్రయాణించాను. 1915 నుండి సంవత్సరం పాటు విడవకుండా మూడో తరగతిలో ప్రయాణం చేశాను. అప్పటికి యిప్పటికీ పెద్ద భేదం నాకు కనబడలేదు. ఈ మహావ్యాధికి ఒక్కటే మందు. చదువుకున్న వాళ్లంతా మూడోతరగతిలో ప్రయాణం చేసి ప్రయాణీకుల దురభ్యాసాలను తొలగింప చేసేందుకు కృషిచేయాలి. అవసరమైన మార్పుల్ని గురించి అర్జీలు పంపించి రైలు అధికారుల్ని నిద్రపోనీయకూడదు. తమతమ సౌఖ్యాలకోసం లంచాలు యివ్వకూడదు. ఇతర అన్యాయమార్గాలను త్రొక్కకూడదు. రైలు నియమాలను