పుట:సత్యశోధన.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

216

గోఖ్లే గారితో ఒక మాసం - 3

అవసరం. అప్పుడే ప్రాణదానం చేయగల శక్తి మనిషికి చేకూరుతుంది. గొర్రెలను ఇంతటి క్రూరమైన హోమం నుండి రక్షించాలంటే నాకు యింకా ఆత్మశుద్ధి, త్యాగం అవసరం. ఇట్టి శుద్ధిని, త్యాగాన్ని గురించి ఘోషిస్తూ ఘోషిస్తూనే ఈ దేహాన్ని విడవలసి వస్తుందేమోనని తోస్తున్నది. మనిషిని ఈమహాపాతకాన్నుండి రక్షించుటకు, నిర్దోషులగు ఈ జీవులను కాపాడుటకు, ఈ ఆలయాన్ని పవిత్రం చేయిటకు ఆ పరమేశ్వరుడు ఏ మహాపురుషుణ్ణి లేక ఏ మహాశక్తిని సృష్టిస్తాడో తెలియదు. కాని నేను అలా సృష్టించమని సదా దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను. జ్ఞానవంతులు, బుద్ధిమంతులు, త్యాగధనులు, భావుకులునగు బెంగాల్ ప్రజలు ఇట్టి వధను ఎట్లు సహించి వూరుకుంటున్నారో తెలియదు. 

19. గోఖ్లేగారితో ఒక మాసం - 3

కాళీ మాత నుద్దేశించి చేయబడుతున్న భయంకరమగు ఈ యజ్ఞాన్ని చూచిన తరువాత బెంగాలీ ప్రజల జీవిత విధానాన్ని గురించి తెలుసు కోవాలనే కోరిక కలిగింది. బ్రహ్మసమాజ మత గ్రంధాలు బాగా చదివాను. వారి ఉపన్యాసాలు విన్నాను. వారు వ్రాసిన కేశవ చంద్రసేన్ గారి జీవిత చరిత్రను ఆసక్తితో చదివాను. సాధారణంగా బ్రహ్మసమాజానికి, అసలు బ్రహ్మాసమాజానికి గల భేదం తెలుసుకున్నాను. పండిత శివనాధశాస్త్రిగారిని దర్శించాను. ప్రొఫెసర్ కాధవటేగారితో కలిసి మహర్షి దేవేంద్రనాధ టాగూరు గారిని దర్శించుటకు వెళ్ళాను. కాని ఆ సమయంలో వారు ఎవ్వరికీ దర్శనం యివ్వడంలేదని తెలిసింది. అందువల్ల వారి దర్శనం కాలేదు. కాని వారి ఇంట్లో జరిగే బ్రహ్మసమాజోత్సవానికి ఆహ్వానింపబడి వెళ్ళి ఆ ఉత్సవాల్లో పాల్గొన్నాను. అక్కడ శ్రేష్టమైన బెంగాలీ సంగీతం విన్నాను. అప్పటినుండి బెంగాలీ సంగీతం అంటే నాకు ఆసక్తి బాగా పెరిగింది.

బ్రహ్మసమాజాన్ని గురించి తెలుసుకున్న తరువాత శ్రీ వివేకానందస్వామి వారి దర్శనం చేసుకోకుండా ఎలా ఉండగలను? అత్యుత్సాహంతో బేలూరు మఠం నడిచి వెళ్ళాను. ఎంతదూరం నడిచానో నాకు ఇప్పుడు గుర్తు లేదు. ఏకాంత స్థలం పున్న ఆ మఠం చూచి నేను చాలా ఆనందపడ్డాను. అక్కడికి వెళ్ళిన తరువాత స్వాముల వారు జబ్బుపడి కలకత్తాలో వున్నారని తెలిసింది. ఈ సమాచారం విని నిరాశపడ్డాను. తరువాత సోదరి నివేదిత గారి ఇంటి జాడ తెలుసుకొని వెళ్ళి ఆమెను దర్శించాను. ఆమె వైభవం చూచి నిలువునా నీరైపోయాను. మాటలోను పలుకులోను కూడా మా