పుట:సత్యశోధన.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకధ

213

కాంగ్రెసులో ప్రేక్షకునిగా పాల్గొనేవారు. జనానికి వారి నిర్ణయం ప్రమాణంగా వుండేది. ఈ విధంగా రానడేగారి గుణగణాలను వర్ణిస్తున్నప్పుడు గోఖ్లేగారు పరవశత్వం చెందేవారు.

గోఖ్లేగారి దగ్గర ఒక గుర్రపు బండి వుండేది. నేను దాన్ని గురించి ప్రశ్నించాను. దాని అవసరం ఏమిటో నాకు బోధపడనందున “మీరు ట్రాముబండి మీద పోతే సరిపోదా? అది నాయకుల ప్రతిష్టకు భంగమా?” అని అడిగాను.

ఈ మాటలు విని కొంచెం బాధపడి యిలా అన్నారు. “నీవు కూడా నా సంగతి తెలుసుకోలేకపోయావు. నాకు కౌన్సిలువల్ల వచ్చే సొమ్మును నా సొంతానికి ఉపయోగించను. మీరంతా ట్రాముబండ్లలో వెళుతూ వుంటే నాకు అసూయ కలుగుతుంది. నేనలా చేయలేను. ఎంతమందితో నాకు పరిచయం వున్నదో అంతమందితో నీకు కూడా పరిచయం వుంటే ట్రాములలో వెళ్లడం అసంభవం కాకపోయినా దుష్కరమని తెలిసేది. నాయకులు చేసేదంతా సౌఖ్యంకోసమేనని అనుకోవడం సరికాదు. నీ మితవ్యయవిధానం నాకు సంతోషదాయకం. వీలైనంత వరకు నేనూ అట్టి వాడినే. కాని నావంటి వానికి కొంత ఎక్కువ వ్యయం కావడం తప్పనిసరి. దీనితో నా ఆక్షేపణ ఒకటి పూర్తిగా రద్దు అయిపోయింది. కాని మరొకటి వుంది. దానికి వారు తప్పక తృప్తికరమైన సమాధానం యివ్వలేక పోయారు.

“అయితే మీరు షికారుకైనా పోరుకదా! యిక ఎప్పుడూ అస్వస్థులై వుండటం సరియేనా? దేశ కార్యాల్లో వ్యాయామానికి అవకాశం దొరకదా?” అని అడిగాను, ‘షికారుకు పోవుటకు ఎప్పుడైనా నాకు అవకాశం కలదని కనుగొన్నారా?’ అని నన్ను అడిగారు.

వారి యెడగల ఆదరం వల్ల వారి యీ మాటకు నేను సమాధానం చెప్పలేదు. వారి ఈమాటవల్ల నాకు తృప్తి కలుగలేదు. కాని నేను మారుమాటాడలేదు. భోజనానికి మనకు సమయం దొరకడం లేదా? అదేవిధంగా వ్యాయామానికి సమయం దొరుకుతుందని నాటికీ, నేటికీ కూడా నా విశ్వాసం. దీని వల్ల దేశ సేవ తగ్గిపోదని ఎక్కువవుతుందని నా అభిప్రాయం. 

18. గోఖ్లేగారితో ఒక మాసం - 2

గోఖ్లేగారి గొడుగు నీడలో వున్న నేను కాలవ్యవధిని గమనించలేదు. హిందూ దేశమందలి క్రైస్తవుల స్థితిగతులను గురించి సవివరంగా తెలుసుకొని మీకు