పుట:సత్యశోధన.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

206

క్లర్కు - బేరా


14. క్లర్కు - బేరా

బేరర్ అనే ఇంగ్లీషు శబ్దానికి బేరా అపభ్రంశం. కలకత్తాలో ఇంట్లో పనిచేసే వాణ్ణి బేరా అని అనడం అలవాటు. కాంగ్రెసు ప్రారంభం కావడానికి యింకా రెండు రోజుల వ్యవధి వుంది. కాంగ్రెసు ఆఫీసులో నాకేమైనా పని దొరికితే కొంత అనుభవం గడించవచ్చని అనిపించింది.

కలకత్తాలో దిగిన రోజే కాలకృత్యాలు ముగించుకొని కాంగ్రెస్ ఆఫీసుకు వెళ్లాను. శ్రీ భూపేంద్రనాధ బోసుగారు, శ్రీ ఘోషాలుగారు కార్యదర్శులు. భూపేంద్రబాబుగారి దగ్గరికి వెళ్లి ఏమైనా పనివుంటే యిమ్మని అడిగాను. వారు నన్ను పరిశీలించి చూచి “నాదగ్గర పనేమీ లేదు. బహుశ ఘోషాలుగారి దగ్గర పనివుంటే చెబుతారు. వారిని చూడు” అని అన్నారు.

ఘోషాలు బాబు గారి దగ్గరికి వెళ్లాను. వారు నన్ను క్రింది నుండి పైదాకా ఎగాదిగా చూచి కొంచెం చిరునవ్వునవ్వి ‘నాదగ్గర క్లర్కు పని వుంది చేస్తావా?’ అని అడిగారు.

“తప్పక చేస్తా. చేతనైన పని చేయడానికే మీదగ్గరకు వచ్చా”

“అబ్బాయి! నిజమైన సేవాభావమంటే యిదే”

వారి దగ్గరే కొందరు వాలంటీర్లు వున్నారు. వారికేసి చూచి “చూచారా! యీ అబ్బాయి ఏమన్నాడో!” అని అన్నారు. మళ్లీ నాకేసి తిరిగి “అదిగో, ఉత్తరాలగుట్ట, దాన్ని తీసుకో. ఇదుగో కుర్చీ. దీనిమీద కూర్చొని పని మొదలుబెట్టు. నా కోసం వందలాది ఉత్తరాలు వస్తుంటాయి. చాలామంది జనం వస్తుంటారు. వీళ్లతోనే మాట్లాడనా లేక ఈ ఉత్తరాలు చూస్తూ కూర్చోనా? ఈ పని చూడడానికి క్లర్కు లేడు. వీటిలో చాలావరకు పనికిమాలినవి. అయితే అన్నింటినీ చదువు. అవసరమైన ఉత్తరాలకు సమాధానం వ్రాయి. అవసరమనుకుంటే నన్ను సంప్రదించు. అని అన్నారు. నన్ను వారు నమ్మినందుకు సంతోషించాను.

ఘోషాలుగారు నన్నెరుగరు. తరువాత నీ పేరేమిటి అని అడిగి తెలుసుకున్నారు. నాకు అప్పగించినది తేలికపని. ఆ పని త్వరగా ముగించాను. ఘోషాలు బాబుగారు సంతోషించారు. ఆయనకు మాట్లాడుతూ వుండటం అలవాటు. మాటలతో కాలం గడిపే మనిషి. తరువాత నీ అంతవాడికి యీ చిన్న పని అప్పగించానే అని