పుట:సత్యశోధన.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

భారతదేశానికి ప్రయాణం

రైలు కలకత్తా చేరింది. నగరవాసులు అధ్యక్షుల వారిని మహా వైభవంగా తీసుకు వెళ్ళారు. అక్కడ అనేక మంది ప్రతినిధులు వున్నారు. అదృష్టవశాత్తు నేనున్న విభాగానికి లోకమాన్యులు విచ్చేశారు. వారు ఒక రోజు ఆలస్యంగా వచ్చినట్లు గుర్తు. లోకమాన్యులు ఎక్కడ వుంటే అక్కడ ఒక చిన్న దర్బారు జరుగుతూ వుంటుంది. లోకమాన్యులు శయ్యపై కూర్చుంటారు. చిత్రకారుణ్ణి అయితే శయ్యపై కూర్చున్నవారి చిత్రం గీసేవాణ్ణి. ఆ దృశ్యం అంత స్పష్టంగా నాకు గుర్తువుంది. వారి దర్శనం కోసం వచ్చేవారి సంఖ్య అపరిమితంగా వుంటుంది. పెద్ద సంఖ్యలో వుంటుందంటే అతిశయోక్తికానేరాదు. వారిలో అమృత బజారు పత్రికాధిపతి మోతీబాబుగారు నాకు బాగా గుర్తు. వారిద్దరి నవ్వు, పరిపాలకుల అన్యాయాల్ని గురించి వారనుకున్న మాటలు యిప్పటికీ నాకు గుర్తు. ఇక అచటి కాంగ్రెస్ వారి నివాసాలను ఒక్కసారి పరిశీలిద్దాం.

వాలంటీర్లలో ఒకరికొకరికి పడదు. ఎవనికైనా ఒకపని అప్పగించితే అతడు ఆ పని చేయడు. అతడు వెంటనే మరొకడికి చెబుతాడు. అతడు యింకొకడికి పురమాయిస్తాడు. యిక పాపం ప్రతినిధులపని హుళక్కే.

కొంతమంది స్వచ్ఛంద సేవకులతో నేను మాట్లాడాను. దక్షిణ - ఆఫ్రికాలో జరిగే పద్ధతి కొద్దిగా చెప్పాను. వాళ్ళు కొంచెం సిగ్గు పడ్డారు. వారికి సేవాధర్మం అంటే ఏమిటో చెబుదామని ప్రయత్నించాను. వారికి కొంచెం కొంచెం బోధపడింది. కాని సేవాభావం, ప్రేమభావం ఎప్పటికప్పుడు ఎక్కడ బడితే అక్కడ పుట్టుకురావడానికి అవి పుట్టకొక్కులు కావుగదా! అవి లోపలి నుండి పుట్టుకురావాలి. దానికి అభ్యాసం కూడా అవసరం. అమాయకులు, సరళ స్వభావులు అయిన ఈ వాలంటీర్లకు సేవ చేద్దామని వుంది, కాని చేసి ఎరగరు. అలవాటు లేదు. ఇప్పుడు రమ్మంటే ఎలా వస్తుంది? అందుకు కారణం కూడ వున్నది. కాంగ్రెస్ జరిగేది సంవత్సరానికి ఒక్కసారి. అదికూడా మూన్నాళ్ల ముచ్చట. తరువాత కథ కంచికి అది ఇంటికి. అట్టి స్థితిలో ఏడాదికి మూడు రోజులు మాత్రం జరిగే తతంగంలో వాలంటీర్లు సవ్యంగా పనిచేయాలంటే సాధ్యమా?

ప్రతినిధులు కూడా స్వచ్ఛంద సేవకుల వంటివారే. వారికి కూడా అది మూన్నాళ్ళ ముచ్చటే. ఈ ప్రతినిధులు తమ పని తాము చేసుకోరు. హుకుములిచ్చి