పుట:సత్యశోధన.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

200

స్వదేశాగమనం


12. స్వదేశాగమనం

యుద్ధం ముగిసిన తరువాత దక్షిణ - ఆఫ్రికాలో యిక నా పని పూర్తి అయిందని స్వదేశంలో చేయవలసిన పని చాలా వున్నదని గ్రహించాను. దక్షిణ ఆఫ్రికాలోనే వుంటే ఏదో కొంత సేవకార్యం దొరకకపోదు. కాని అక్కడ వుండిపోతే డబ్బు సంపాదనే ప్రధాన లక్ష్యంగా మారుతుందనే సందేహం నాకు కలిగింది. దేశమునందలి మిత్రులు దేశం రమ్మని వత్తిడి చేయసాగారు. దేశం వెళితే ఎక్కువ ఉపయోగం వుంటుందని అనుకున్నాను. నేటాలులో ఖాన్‌గారు మన సుఖలాలుగారు వుండనే వున్నారు.

నాకు యిక సెలవు యిమ్మని మిత్రుల్ని కోరాను. అతికష్టం మీద ఒక షరతు పెట్టి సెలవు మంజూరు చేశారు “ఒక్క సంవత్సరంలో తిరిగి పనిబడితే మీరు యిక్కడికి రావాలి.” అనేది వారి షరతు. నాకది విషమ షరతు అనిపించింది. కాని ప్రేమపాశంచే బద్ధుడనైనాను.

“కాచేరే తాంతణే మన్ హరజీఏ బాందీ,
జేమ తాణే తేమ తేమనీరీ,
మనేలాగీ కటారీ ప్రేమనీ”

(ఆ నారాయణుడు నా మెడకు ప్రేమ బంధం వేశాడు. దాన్ని పుచ్చుకొని అతడు లాగిన కొద్దీ ఆహాహా, నేను అతని దానినయిపోతున్నాను.)

మీరాబాయి గానం చేసిన యీ గీతం నాకు బాగా వర్తించింది. జనతా జనార్ధనుని మాట కాదనలేక పోయాను. వారికి మాటయిచ్చి సెలవు తీసుకున్నాను. ఈ పర్యాయం నేటాలుతో నాకు సంబంధం అధికంగా ఏర్పడింది. నేటాలు నందలి భారతీయులు, నామీద ప్రేమామృతం అపరిమితంగా కురిపించారు. ఊరూర అభినందన పత్రాలు, ఊరూర కానుకలు అందజేశారు. 1899 వ సంవత్సరంలో దేశానికి పస్తున్నప్పుడు కూడా కానుకలు లభించాయి. యీ సారి ఆ కానుకల్ని, ఆ సభల్ని చూచి బెదిరిపోయాను. బంగారు, వెండియేగాక వజ్రాలు కూడా లభించాయి.

నేను యీ కానుకల్ని స్వీకరించవచ్చునా? నేను యీ కానుకల్ని తీసుకుంటే డబ్బు తీసుకోకుండా ప్రజల సేవ చేసినట్లవుతుందా? నాక్లయింటు యిచ్చినవి కొన్ని మాత్రం కాక మిగతావన్నీ ప్రజాసేవకుగాను యివ్వబడినవే గదా! అయితే యీ రెండింటికీ నా దృష్టిలో తేడా లేదు. పెద్ద పెద్ద క్లయింట్లందరు ప్రజా కార్యక్రమాలకు సాయపడ్డవారే.