పుట:సత్యశోధన.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

198

నగర పారిశుద్ధ్యం - క్షామనిధి

ప్రాణాలు విడిచాడు. వారిని మోసుకొని వెళ్ళే అదృష్టం మా దళానికి కలిగింది. వచ్చేటప్పుడు ఎండ మాడిపోత్నుది. అందరి నాలుకలు దాహంతో పిడచకట్టుకు పోయాయి. దారిలో ఒక చిన్న సెలయేరు కనబడింది. ముందెవరు మంచినీళ్ళు త్రాగాలన్న ప్రశ్న బయలుదేరింది. ముందు తెల్ల సోల్జర్లు త్రాగాలి. ఆ తరువాత మేము త్రాగుతాము అని చెప్పాము. వెంటనే ముందు మీరు త్రాగండి అని తెల్ల సోల్జర్లు అన్నారు. ముందు మీరు త్రాగండని మేము వారిని కోరాం. ఈ విధంగా చాలా సేపటి వరకు మీరు త్రాగండంటే మీరు త్రాగండని ప్రేమతో పోటీపడ్డాం.

11. నగర పారిశుద్ధ్యం - క్షామనిధి

సంఘమను శరీరంలో ఏ అవయవం చెడినా ప్రమాదమే. అది నాకు యిష్టం వుండదు. లోకులు దోషాల్ని కప్పి పుచ్చడం, వాటిని చూచీ చూడనట్లు ఊరకుండి మా హక్కుల్ని మాకిమ్మని ప్రభుత్వాన్ని కోరడం నాకు యిష్టం వుండదు. దక్షిణ - ఆఫ్రికా యందలి భారతీయుల మీద ఒక ఆక్షేపణ వుండేది. “భారతీయులు మడ్డి రకం. వారి యిండ్లు చెత్త చెదారంతో నిండి మైలగా వుంటాయి” అని మాటిమాటికీ తెల్లవాళ్ళు ఆక్షేపిస్తూ వుండేవారు. అందులో కొంత సత్యం వున్నది. నేను అక్కడికి వెళ్ళినప్పటినుండి ఈ ఆక్షేపణ ఎలా తొలగించడనూ అని యోచిస్తూ వున్నాను. కొంచెం ప్రయత్నించగా పేరు పడియున్న పెద్ద ఇండ్లన్ని పరిశుభ్రమైనాయి. కాని డర్బనులో ప్లేగు ప్రవేశించి ప్రకోపిస్తుందనే వార్త పుట్టింది. ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం చేయడం పడలేదు. అందుకు మునిసిపాలిటీ సమ్మతి కావాలి. అది మాకు లభించింది. మేము పని చేయడానికి పూనుకున్నాం. అందువల్ల మునిసిపాలిటీ వారి పని తేలిక అయింది. భారతీయుల కష్టాలు కూడా తగ్గాయి. ప్లేగు మొదలుగా గల జబ్బులు వ్యాప్తి చెందినప్పుడు అధికారులు జనం మీద విరుచుకుపడేవారు. ఇష్టులు కాని వారి మీద వత్తిడి ఎక్కువయ్యేది. భారతీయులు శుచిగా వుండటం ప్రారంభించిన తరువాత అట్టి కష్టాలు బాధలు తగ్గిపోయాయి

ఈ విషయంలో నేను కూడా చాలా కష్టాలు చవిచూచాను. హక్కుల కోసం నేటాలు ప్రభుత్వంతో పోరాటం నడుపుటకు వారి వల్ల ఎంత సాయం పొందగలిగానో, అంత సాయం వారి చేత వారి విధుల్ని అమలుచేయించుటకు కృషిచేసి వారి సాయం పొందలేకపోయాను. కొందరు నన్ను అవమానించారు. కొందరు వినయపూర్వకంగా ఫరవాలేదు ఫరవాలేదు అంటూ కాలం గడిపారు. చాలామంది తమ మురికిని తాము