పుట:సత్యశోధన.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సత్యమని నమ్ముతుందో ఆకాల్పనిక సత్యాన్ని ఆధారం చేసుకొని, దాన్ని దీపంగా భావించి, దాని ఆశ్రయంలో జీవితం గడుపుతాను. నిజానికి ఇది కత్తిమీద సాము వంటిది. అయినా నాకు సులువు అనిపించింది. ఈ మార్గాన నడుస్తున్నప్పుడు భయంకరమైన పొరపాట్లు కూడా నాకు తుచ్ఛమైనవిగా కనబడతాయి. అట్టి పొరపాట్లు చేసికూడా రక్షణ పొందాను. నాకు తెలిసినంతవరకు ముందుకేసాగాను. విశుద్ధ సత్యపు వెలుగురేఖ దూరాన లీలగా కనబడుతూ వుంది.

ఈ జగత్తులో సత్యం దప్ప మరొకటి ఏమీ లేదనునమ్మకం రోజురోజుకు నాలో పెరుగుతూవున్నది. ఎలా పెరుగుతూవున్నదో నా ప్రపంచపు అనగా నవజీవన్ మొదలుగాగల పత్రికల పాఠకులు తెలుసుకొని యిష్టమైతే నా ప్రయోగాలలో భాగస్వాములు అవుదురుగాక. అంతేగాక నాకు శక్యమైన వస్తువు ఒక బాలునికి సైతం శక్యం కాగలదని నా నమ్మకం. అందుకు బలవత్తరమైన కారణాలు అనేకం వున్నాయి. సత్యశోధనకు సంబంధించిన సాధనాలు ఎంత కఠినమైనవో అంతసరళమైనవికూడా. ఆ అహంకారికి అశక్యాలు, కాని కల్లాకపటం ఎరుగని బాలునికి శక్యాలు. సత్యాన్వేషకుడు ధూళికణం కంటే చిన్నగా వుండాలి. ప్రపంచం అంతా ధూళికణాన్ని కాలిక్రింద త్రొక్కి వేస్తుంది. అయితే సత్యాన్వేషకుడు ధూళికణం కూడా తొక్కి వేయలేసంత సూక్ష్మంగా వుండాలి. అప్పుడే అతనికి సత్యం లీలగా గోచరిస్తుంది. ఈ విషయం విశిష్ట విశ్వామిత్రులకథలో స్పష్టంగా చెప్పబడింది. క్రైస్తవ, ఇస్లాంమతాలుకూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి.

నేను వ్రాస్తున్న ప్రకరణాల్లో పాఠకులకు అహంభావపు వాసన తగిలితే నా అన్వేషణలో ఏదో పెద్ద పొరపాటు వున్నదనీ నేను కనుగొంటున్ను వెలుగు రేఖ ఎండమావియేనని గ్రహించాలి. నా వంటి పలువురు శోధకులు మగ్గిపోయినా సత్యం మాత్రం సదా జయించాలి. అల్పమైన ఆత్మను కొలుచుటకు సత్యమనే కొలబద్ద ఎన్నటికీ తరిగిపోకూడదు. నా ప్రకరణాలను ప్రామాణికమని భావించవద్దని అందరినీ ప్రార్థిస్తున్నాను. నేను పేర్కొన్న ప్రయోగాలను దృష్టాంతాలుగా భావించి అంతా తమతమ ప్రయోగాలు శక్త్యానుసారం, తమకు తోచిన విధంగా చేయాలని కోరుతున్నాను. నా ఆత్మకధవల్ల ఏదో కొంత ప్రజలకు లభించగలదని విశ్వసిస్తున్నాను. ప్రకటించుటకు అనుకూలమైన ఏ ఒక్క విషయాన్ని కూడా నేను దాచలేదని మనవి చేస్తున్నాను. నా దోషాలన్నింటిని పూర్తిగా పాఠకులముందు వుంచానని విశ్వసిస్తున్నాను. సత్యపు

XXI