పుట:సత్యశోధన.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

195

నా సమాధానం విని వాళ్లు ఆశ్చర్యపడలేదు. నిజానికి యిందు మంగలి అపరాధం ఏమీ లేదు. నల్లవాడికి క్షవరం చేస్తే అతడి కూట్లో రాయిపడుతుంది. మనం మాత్రం మన మంగళ్లను మాదిగలకు క్షవరం చేయనిస్తామా? దక్షిణ - ఆఫ్రికాలో యిట్టి అనుభవం ఒక్కసారి కాదు, అనేకసార్లు నాకు కలిగింది. ఇది మన పాపఫలమే అని నిర్ణయానికి వచ్చాను. అందువల్ల నాకు ఈ విషయమై ఎన్నడు రోషం కలుగలేదు.

నా పనులన్నీ నేనే చేసుకోవాలి, వ్యయం తగ్గించుకోవాలి. అని కోరికలు బయలుదేరి తీవ్రరూపం ధరించాయి. ఆ వివరం తరువాత పలుచోట్ల తెలియజేస్తాసు. కాని దీనికి మూలం చాలా పురాతనమైనది. పూచేందుకు, కాచేందుకు, మూలానికి నీరు పోయవలసిన అగత్యం ఏర్పడింది. అందుకు దక్షిణ - ఆఫ్రికా పరిస్థితులు బాగా తోడ్పడ్డాయి.

10. బోయరు యుద్ధం

1897 నుండి 1899 వరకు నా జీవితంలో కలిగిన యితర అనుభవాల్ని వదిలి బోయరు యుద్ధాన్ని గురించి తెలియజేస్తాను. యుద్ధం ప్రారంభమైనప్పుడు నేను పూర్తిగా బోయర్లకు అనుకూలంగా వున్నాను. ఇటువంటి విషయాల్లో వ్యక్తిగతమైన అభిప్రాయాల ప్రకారం పని చేసే అధికారం నాకు లేదని అనుకున్నాను. ఈ విషయమై నా హృదయంలో అపరిమితంగా మథనం సాగింది. ఆ వివరం దక్షిణ - ఆఫ్రికా సత్యాగ్రహచరిత్రలో వివరించాను. అందువల్ల దీన్ని యిక్కడ వ్రాయను. తెలుసుకోదలచిన వారు ఆ చరిత్ర చదివి తెలుసుకోవచ్చును. తెల్ల ప్రభుత్వం వారి ప్రజలం కనుక ఆ యోగ్యత ప్రకారం మనకు వుండవలసిన హక్కుల్ని మనం పుచ్చుకోవలసియున్నట్లే, తెల్ల ప్రభుత్వం వారియెడ గల విశ్వాసం ఈ యుద్ధంలో వారికి సాయపడమని నన్ను ముందుకు త్రోసింది. తెల్లప్రభుత్వం వారి ప్రజలం కనుక ఆయోగ్యత ననుసరించి బ్రిటీష్ రాజ్య రక్షణకు సాయపడటం మన ధర్మం అని భావించాను. భారతీయుల వికాసానికి బ్రిటీష్ సామ్రాజ్యమే శరణ్యమని ఆ రోజుల్లో నాకు అభిప్రాయం ఏర్పడింది.

ఆ కారణం వల్ల దొరికినంతమంది మిత్రుల్ని చేరదీసి, యుద్ధంలో గాయపడిన వారికి సేవ చేసేందుకై ఎంతో కష్టపడి ఒక దళాన్ని ప్రోగుచేశాను. నల్లవారంతా పిరికివారనీ, అపాయాల్ని ఎదుర్కోలేరనీ, తమ పనుల్ని తప్ప మిగతా పనుల్ని పట్టించుకోరనీ, స్వార్థపరులనీ అప్పుడు ఇంగ్లీష్‌వాళ్ళు భావిస్తు వుండేవారు. అందువల్ల నా