పుట:సత్యశోధన.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

177

రెచ్చిపోయారు. ఇందు వారి తప్పు ఏమీ లేదని భావిస్తున్నాను. అసలు దీనికంతటికీ కారకులు మీ నాయకులు, మన్నించండి. మీరే యిందుకు బాధ్యులు. మీరు ప్రజలను సరియైన మార్గాన నడిపించాలి. అట్టిమీరే రూటరు మాట నమ్మి నాకు వ్యతిరేకంగా వ్యవహరించారు. నేనేదో ఇండియాలో చేశానని విచారించకుండా మీరు వ్యవహరించారు. తత్ఫలితమే యీ కాండ. అందువల్ల నేనెవ్వరినీ శిక్షించతలచలేదు. నిజం తెలిసినప్పుడు వారు తప్పక పశ్చాత్తాప పడతారనే విశ్వాసం. నాకు వున్నది.” అని నేను అన్నాను.

‘అయితే ఈ మాటలే వ్రాసి యివ్వండి. మీరు వ్రాసి యిచ్చే మాటలు చేంబర్లేను గారికి తంతిద్వారా తెలియజేస్తాను. తొందరపడి వ్రాసిమ్మని నేను కోరాను. లాటనుగారితోను, తదితర మిత్రులతోను సంప్రదించి ఏది ఉచితమో అదే చేయండి. మీరు ఘాతకులపై కేసు పెట్టని ఎడల అందరినీ సులువుగా శాంతింప చేయవచ్చు. ఆ విధంగా చేస్తే మీ గౌరవ ప్రతిష్టలు తప్పక పెరుగుతాయి’ అని ఎస్కాంబీగారు అన్నారు.

“ఈ విషయంలో నా మాట ఖాయం. మీ దగ్గరకు రాకముందే నేను యిట్టి నిర్ణయానికి వచ్చాను. నన్ను కొట్టిన వారిమీద కేసు పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరు కోరిన ప్రకారం ఇప్పుడే వ్రాసి యిస్తాను” అని చెప్పి అవసరమైన పత్రం వ్రాసి వారికి యిచ్చి వేశాను.

4. శాంతి

ఆ రోజున నా మీద దాడి జరిగిన తరువాత నేను పోలీసు స్టేషను చేరాను. అక్కడ రెండు రోజులు పున్నాను. నా వెంట యిద్దరు పోలీసులు రక్షణ కోసం వున్నారు. తరువాత ఎస్కాంబీగారిని కలుసుకునేందుకు వెళ్ళాను. అప్పటికి పోలీసుల కాపలా అవసరం లేకుండా పోయింది.

నేను ఓడ దిగిన రోజున అనగా పచ్చజెండా దింపిన రోజున నేటాల్ అడ్వర్‌టైజర్ పత్రికా ప్రతినిధి వడివడిగా వచ్చి నన్ను కలిసి మాట్లాడాడు. అనేక ప్రశ్నలు వేశాడు. అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం యిచ్చాను. సర్ ఫిరోజ్ షా మెహతాగారి సలహా ప్రకారం హిందూ దేశంలో నేను యిచ్చిన ఉపన్యాసాలన్నీ ముద్రింపబడి వున్నాయి. వాటన్నింటిని నేను అతనికి యిచ్చాను. దక్షిణ - ఆఫ్రికాలో నేను అదివరకు చెప్పిన మాటల్నే హిందూదేశంలో కూడా చెప్పాను. అంతకు మించి ఒక్కమాట అయినా